twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది

    |

    దాదాపు మూడు దశాబ్దాలుగా బీ గ్రేడ్ సినిమాలు చేస్తూ దక్షిణాదిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన నటి షకీలా. తన అందచందాలతో స్టార్ హీరోలు, హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారామె. అంతేకాదు, భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ సత్తా చాటారు. ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగిన ఈ బోల్డ్ లేడీ.. క్రేజ్‌తో పాటు ఆస్తులను కూడా కోల్పోయారు. దీంతో ఇప్పుడు సామాన్య జీవనం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షకీలా.. అలీతో సరదాగ అనే షోకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

    భారతదేశంలోనే ఏకైక శృంగార తారగా

    భారతదేశంలోనే ఏకైక శృంగార తారగా

    1994 నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపుతూ హాట్ టాపిక్‌గా నిలిచారు షకీలా. కేవలం బీ గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకున్నారు. తన ప్రతి సినిమాకూ హౌస్‌ఫుల్ బోర్డులు పడేలా ఆమె రెచ్చిపోయి నటించేవారు. ఈ కారణంగానే భారతదేశంలోనే ఏకైక శృంగార తారగా అప్పట్లో ఆమె గుర్తింపును పొందారు.

    స్టార్ హీరో సినిమాకూ దక్కని రెవెన్యూ

    స్టార్ హీరో సినిమాకూ దక్కని రెవెన్యూ

    షకీలా సినిమాలకు దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ విపరీతమైన ఆదరణ లభించేది. అన్ని రకాల వయసుల వాళ్లూ ఆమె అందాలను చూసేందుకు పోటీ పడేవారు. దీంతో ఈ శృంగార తార సినిమాలు ఆడే థియేటర్లు అన్నీ కలకళలాడిపోతుండేవి. అందుకే ఒకానొక సందర్భంలో స్టార్ హీరోల సినిమాలతో పోటీగా ఆమెకు కలెక్షన్లు వచ్చేవి. కొందరైతే షకీలా సినిమా ఉంటే భయపడేవారు.

    ప్రేమలు విఫలం.. మోసపోయిన భామ

    ప్రేమలు విఫలం.. మోసపోయిన భామ

    షకీలా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గతంలో ఆమె ప్రేమలు విఫలం అవడమే. ఈ శృంగార తార ఇప్పటి వరకు ఏడెనిమిది మందితో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే, వాళ్లంతా పెళ్లి చేసుకోడానికి మాత్రం సిద్ధ పడలేదని కూడా షకీలా పలుమార్లు చెప్పుకొచ్చారు. అలాగే, తన ఆస్తుల విషయంలోనూ మోసపోయారామె.

    దానికి రెడీ అంటూ అలీతో షకీలా రచ్చ

    దానికి రెడీ అంటూ అలీతో షకీలా రచ్చ

    ఈ మధ్య సినిమాలు తగ్గించిన షకీలా.. కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే 'అలీతో సరదాగ' అనే షోకు వచ్చారు. ఈ సందర్భంగా హోస్ట్ అలీ మాట్లాడుతూ.. 'మీకు స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నట్లుంది. బైకులకు అలా ఉంటే పడుకోబెట్టి ఒక్కటి కొడతారు' అని అన్నాడు. దీనికి స్పందించిన షకీలా 'ఇక్కడ పడుకోడానికి కూడా నేను రెడీగా ఉన్నాను' అని చెప్పి షాకిచ్చారు.

    మోసం చేసిన యాక్టర్ పేరు లీక్ చేసింది

    మోసం చేసిన యాక్టర్ పేరు లీక్ చేసింది

    తన ప్రేమలు, వివాహం గురించి మాట్లాడిన షకీలా.. 'ఒకడితో పెళ్లి చేసుకునే వరకూ వచ్చింది. రఖాపై సంతకం పెట్టే ముందు.. సిగరెట్ మానేస్తానంటేనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పుడు వాడ్ని పిచ్చ కొట్టుడు కొట్టి వచ్చేశా. నన్ను లవ్ చేసిన వాళ్లంతా నాతో టచ్‌లో ఉన్నారు. వాళ్ల పెళ్లాలు కూడా మాట్లాడతారు. పెళ్లి అవ్వాలని రిచర్డ్ అనే వాడి పేరు లీక్ చేస్తున్నా' అంటూ ఆమె తెలిపారు.

    తెలుగు డైరెక్టర్ కాల్ చేశారంటూ కన్నీరు

    తెలుగు డైరెక్టర్ కాల్ చేశారంటూ కన్నీరు

    లాక్‌డౌన్ సమయంలో ఓ తెలుగు బడా డైరెక్టర్ తనకు ఫోన్ కాల్ చేశారని చెప్పింది షకీలా. 'కరోనా సమయంలో ఇబ్బందులు పడుతోన్న సమయంలో ఓ డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. ఏవమ్మా బాగున్నావా? ఆర్థిక పరిస్థితి బాగానే ఉందా? నాకు ఇష్టమైన వాళ్లకు ఫోన్ చేయాలనిపించింది. అందుకే నీకు చేశా అని అడిగారు. దీంతో అప్పుడే ఏడ్చేశాను' అని గుర్తు చేసుకున్నారామె.

    English summary
    Shakeela, known mononymously as Shakeela, is an Indian actress and model who predominantly acted in Cinema of South India. Shakeela debuted in the film Playgirls (1995) at the age of 18 as a supporting actress. She appeared in about 250 films, most of them softcore, which made her a major sex symbol in the late 1990s and early 2000s.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X