twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు రెమ్యూనరేషన్ ఇస్తావారా?.. చిరంజీవి ఫైర్.. శరత్ కుమార్ కన్నీరు

    |

    మెగాస్టార్ చిరంజీవి, హీరో శరత్ కుమార్ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి తెలిసిందే. కేవలం స్నేహితులే కాకుండా.. కుటుంబ సభ్యుల్లా ఇరువురు కలిసి ఉంటారు. సినిమాల వరకే కాకుండా వ్యక్తిగతంగా ఎంతో మంచి మిత్రులు కావడం, కష్టాల్లో ఉన్న శరత్ కుమార్ ఒకానొక సమయంలో చిరు సాయాన్ని అర్థించాడట. వెంటనే ఓకే అన్నాడని, నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ శరత్ కుమార్ కన్నీరుమున్నీరయ్యాడు. లైవ్ ‌లోనే కంటతడి పెట్టేశాడు. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Megastar Chiranjeevi Enjoying Music With Grand Daughter Navishka
    ముప్పై యేళ్ల జగదేకవీరుడు..

    ముప్పై యేళ్ల జగదేకవీరుడు..

    అలనాటి క్లాసిక్ జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజై నిన్నటికి (మే 9) ముప్పై యేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో వైజయంతీ మూవీస్, చిరంజీవి సోషల్ మీడియ వేదికగా ఎమోషనల్ అయ్యారు. ముప్పై యేళ్ల జగదేకవీరుడు పండగ ఓ రేంజ్‌లో జరిగింది. ఈ మేరకు ఓ ఛానెల్‌లో రాధిక, శరత్ కుమార్ మాట్లాడారు.

    నాటి సంగతులను గుర్త చేసుకుంటూ..

    నాటి సంగతులను గుర్త చేసుకుంటూ..

    జగదేక వీరుడు సినిమాకు ముప్పై యేళ్ల సందర్భంగా చిరుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న రాధిక, శరత్ కుమార్‌లు ఓ మీడియాకు లైవ్ ఇంటర్వ్యూలో ఇచ్చాడు. ఈ మేరకు చిరుతో ఉన్న అనుబంధం గురించి రాధిక వివరించింది. తానెప్పుడూ చిరు పట్ల గర్వంగానే ఫీల్ అవుతానని తెలిపింది.

    సాయం కోసం చిరు దగ్గరకు..

    సాయం కోసం చిరు దగ్గరకు..

    హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ... తాను ఒకానొక సమయంలో పూర్తిగా డౌన్ ఫాల్‌లో ఉన్నానని, అప్పులు కూడా పెరిగిపోయాయని చెప్పుకొచ్చాడు. అయితే అదే సమయంలో ఓ నిర్మాత వచ్చి.. చిరంజీవి డేట్స్‌ను పట్టుకొస్తే.. నీకు కొంత డబ్బులు వస్తాయ్.. నీ అప్పులన్నీ తీరుతాయ్ అని సలహా ఇచ్చారు. అయితే వెంటనే చిరుకు ఫోన్ చేస్తే హైద్రాబాద్‌లో ఉన్నానని చెప్పాడు.

    షూటింగ్ ఆపేసి మరీ..

    షూటింగ్ ఆపేసి మరీ..

    షూటింగ్ జరుగుతుండగా తాను చిరు వద్దకు వెళ్లానని తెలిపాడు. పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పడంతో మధ్యాహ్నం షూటింగ్‌ను క్యాన్సిల్ చేసేశాడని, డైరెక్టర్‌ను పిలిచి రేపు షూటింగ్ పెట్టుకుందామని, శరత్ వచ్చాడు మాట్లాడుకుంటామని చెప్పాడు.

    నాకు రెమ్యూనరేషన్ ఇస్తావారా?

    నాకు రెమ్యూనరేషన్ ఇస్తావారా?

    ప్రేమగా వడ్డించి.. సమస్య ఏంటో చెప్పమన్నాడని గుర్తు చేసుకున్నాడు. నీ డేట్స్ కావాలి.. నాకున్న అప్పులు తీరిపోతాయ్ అని చిరును అడిగినట్టు చెప్పాడు. ఆయన వెంటనే ఓకే చెప్పాడని, తదుపరి చిత్రం ఇస్తానని తెలిపాడు. అయితే రెమ్యూనరేషన్ ఎంత? అని అడిగితే.. నాకు రెమ్యూనరేషన్ ఇస్తావారా? అని ఫైర్ అయ్యాడని తెలిపాడు. ‘నువ్వే కష్టాల్లో ఉన్నానని చెప్పావ్‌గా నాకు రెమ్యూనరేషన్ వద్ద'ని చిరు అన్నాడని నాటి విషయాలను గుర్తు చేసుకుని శరత్ కుమార్ కన్నీరుపెట్టుకున్నాడు.

    English summary
    Sharath Kumar Became Emotional About Chiranjeevi help. On The Occassion Of 30Years Of Jagadekaveerudu Athilokasundari Sharath Umar Recalled Chiranjeevi Helping Nature.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X