మహా సముద్రం సెట్స్‌లో సంబరాలు.. శర్వానంద్‌కు సర్ ప్రైజ్
యంగ్ హీరో శర్వానంద్ పుట్టినరోజు నేడు (మార్చి 6). శర్వానంద్, రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరి పరిచయం ఈనాటిది కాదు. అలా తన క్లోజ్ ఫ్రెండ్ బర్త్ డేను రామ్ చరణ్ సింపుల్ ఎలా వదిలేస్తాడు. అందుకే ఆచార్య షూటింగ్ ముగించుకుని వచ్చిన.. సడెన్ సర్ ప్రైజ్ ఇస్తూ రాత్రి బర్త్ డే పార్టీని సెలెబ్రేట్ చేశాడు రామ్ చరణ్. ఈ మేరకు బయటకు వచ్చిన ఫోటోలు బాగానే క్లిక్ అయ్యాయి.
ఇక ప్రస్తుతం శర్వానంద్ మహాసముద్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శ్రీకారం మూవీ పనులు పూర్తయ్యాయి. అది విడుదలకు రెడీగా ఉంది. సెట్స్ మీదున్న సినిమాలు, సెట్స్ మీదకు వెళ్లే సినిమా యూనిట్ ఇలా అందరూ కూడా శర్వానంద్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వచ్చారు. అయితే తాజాగా శర్వానంద్ బర్త్ డేను మహా సముద్రం యూనిట్ ఎలా సెలెబ్రేట్ చేసిందో బయటకు వచ్చేసింది.

కొలవలేనంత ప్రేమ అంటూ మహా సముద్రం నుంచి శర్వానంద్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హై యాక్షన్ సీక్వెన్స్‌లు ఈసినిమాలో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ అదితి రావ్ హైదరీ, సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి మహా సముద్రం సినిమాను అనుకున్నట్టుగానే పూర్తి చేయబోతోన్నా అజయ్ భూపతి. ఈ మూవీ ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











