For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫర్ కావాలని మెసేజ్ చేస్తే.. రాంగోపాల్ వర్మ సెక్స్ వీడియో పంపించాడు: హీరోయిన్ సంచలన ఆరోపణలు

|
ఆఫర్ కావాలని మెసేజ్ చేస్తే.. రాంగోపాల్ వర్మ సెక్స్ వీడియో పంపించాడు

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా చర్చనీయాంశమే అవుతోంది. గతంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేసిన ఈ దర్శకుడు.. కొద్దిరోజులుగా తన పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వివాదాస్పద అంశాలపై సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు. అదే సమయంలో చాలా మందికి శతృవుగా కూడా మారిపోతున్నాడు. అయినా వర్మ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా అతడిపై ఓ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరామె..? ఎందుకు చేసింది..? వివరాల్లోకి వెళితే...

ఆమె మరెవరో కాదు.. మన అమ్మాయే

రాంగోపాల్ వర్మపై సంచలన ఆరోపణలు చేసిన అమ్మాయి మరెవరో కాదు.. హైదరాబాదీ నటి షెర్లిన్ చోప్రా. అవును.. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ కొద్దిరోజులుగా న్యూడ్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దీంతో తాజాగా ‘మిడ్ డే' ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే వర్మపై ఆరోపణలు చేసింది.

ఆఫర్ కావాలని మెసేజ్ చేశాను

ఆఫర్ కావాలని మెసేజ్ చేశాను

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రాంగోపాల్ వర్మ ఇష్యూను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మీకు రాంగోపాల్ వర్మ ఏదో ఆఫర్ ఇచ్చాడని విన్నాము నిజమేనా అని ఆయన అడిగిన ప్రశ్నకు ‘నాకు రాంగోపాల్ వర్మ అంటే ఇష్టం. ఆయన సినిమాలు బాగుంటాయి. అందులో హీరోయిన్‌ను మంచిగా చూపిస్తాడు. అందుకే 2016లో ఆయనకు వాట్సాప్‌లో నా ఫొటోలు, నా వివరాలు పంపాను. మీ సినిమాలో ఏదైనా ఆఫర్ ఉంటే ఇవ్వండి అని అడిగాను' అని ఆమె చెప్పుకొచ్చింది.

ఆయన మాత్రం ఏదో స్క్రిప్ట్ పంపాడు

ఆయన మాత్రం ఏదో స్క్రిప్ట్ పంపాడు

అంతేకాదు, తన మెసేజ్‌కు వర్మ రిప్లై ఇచ్చాడని చెప్పిన షెర్లిన్.. ‘ఓ స్క్రిప్టు పంపిస్తున్నాను. ఇది చదవి చెప్పు. నచ్చితే వెంటనే సినిమా చేద్దాం' అని వర్మ అందులో పేర్కొన్నట్లు చెప్పింది. ‘ఏక్‌థా రాజా ఏక్‌థి రాణి' అనే టైటిల్ ఉన్న ఆ స్క్రిప్టు చదివితే సెక్స్ సీన్స్ తప్ప ఏమీ కనిపించలేదని షెర్లిన్ పేర్కింది. అందులో రాజు రాణికి మధ్య సెక్స్ సీన్స్ ఉంటాయని మాత్రమే వర్మ రాశాడంది. అదే విషయాన్ని వర్మతో అన్నానని కూడా చెప్పింది. ఆయన మాత్రం నచ్చితే చెప్పు లేకపోతే లేదు అన్నాడని వివరించింది.

 సెక్స్ వీడియో పంపాడు

సెక్స్ వీడియో పంపాడు

రాంగోపాల్ వర్మ తనకు సెక్స్ వీడియో పంపాడని షెర్లిన్ తెలిపింది. ‘నేను ఆయనను ప్రశ్నిస్తూ మెసేజ్ చేయగానే వర్మ నాకో వీడియో పంపాడు. అందులో ఓ మహిళ కుక్కతో సెక్స్ చేస్తున్న సీన్స్ ఉన్నాయి. అది చూసి నేను షాక్ అయిపోయాను. వెంటనే కోపంగా నాకెందుకు ఇది పంపారని కోపంగా రిప్లై ఇచ్చాను. దీనికి ఆయన ‘సెక్స్ సీన్స్ ఉన్నాయని నువ్వు సినిమా చేయనంటున్నావు. వాస్తవానికి సెక్స్ అనేది సాధారణ విషయం అది మనుషులకైనా.. పశువులకైనా. అది వివరించాలనే ఈ వీడియో పంపాను' అని వర్మ చెప్పుకొచ్చాడ'ని షెర్లిన్ పేర్కొంది.

నేనేమీ పీహెచ్‌డీ చేయలేదు

నేనేమీ పీహెచ్‌డీ చేయలేదు

ఇదే విషయంపై మరింత వివరణ ఇచ్చింది షెర్లిన్. ‘వర్మ నాకు ఆ వీడియో పంపడంతో పాటు టెక్ట్స్ మెసేజ్ చేసిన సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. అయితే, ఆఫర్ కావాలని అడగడం నా తప్పు. అందుకే ఆయనను ఏమీ అనలేదు. కానీ, నేను సెక్స్‌లో పీహెచ్‌డీ చేయలేదు అని మాత్రం రిప్లై ఇచ్చాను. అప్పటి నుంచి వర్మకు మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయలేదు. వ్యక్తిగతంగా కూడా కలవలేదు' అని ఆమె వెల్లడించింది.

కేసు ఎందుకు పెట్టలేదంటే..

కేసు ఎందుకు పెట్టలేదంటే..

కాస్టింగ్ కౌచ్ అంటూ చాలా మంది తెరపైకి వచ్చినా కూడా ఈ విషయాన్ని మీరు ఎందుకు ప్రస్తావించలేదు.. ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. ‘ఈ వ్యవహారం తర్వాత వర్మ నన్ను సినిమా చేయాలని ఇబ్బంది పెట్టలేదు. అదీ కాక ఆయన నన్ను అడిగాడు అంతే. నేను చేయనన్నాను అక్కడితో అయిపోయింది. అందుకే మీటూ సమయంలో స్పందించలేదు. కేసు కూడా పెట్టలేదు' అని షెర్లిన్ తెలిపింది.

షెర్లిన్‌ది హైదరాబాదే

షెర్లిన్‌ది హైదరాబాదే

షెర్లిన్ చోప్రా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువు పూర్తి చేసింది. చదువుకుంటున్న సమయంలోనే ఆమె మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొందింది. ఆ తర్వాత ‘వెండిమబ్బు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మంచు విష్ణు ‘గేమ్', ‘ఏ ఫిల్మ్ బై అరవింద్' సహా పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో కలిసి రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆమె ముంబై వెళ్లిపోయింది.

English summary
Bold Beauty Sherlyn Chopra another Hot video Released. Sherlyn Chopra, one of the boldest ladies in Bollywood, just released her eagerly-awaited Awesome Mausam song on her App and it has created a great deal of buzz amongst fans for all the right reasons.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more