Yoga Day 2023: యోగా చేస్తూ హీరోయిన్ల హాట్ షో.. ఆ ఆసనాలు, అందాలు చూస్తే మెంటలే!
యోగా.. నేటి జీవన విధానంతో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడే మంచి సాధనం. అందుకే యోగా ప్రాముఖ్యత తెలియాలనే ఆలోచనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది జూన్ 21న అంటే ఇవాళ యోగా దినోత్సవాన్ని (Yoga Day 2023) నిర్వహించుకుంటారు.
ఇక స్టార్ సెలబ్రిటీలు తమ ఫిట్ నెస్ కు ఎంతగానో ఉపయోగపడే ఈ యోగాను నిత్యం చేస్తుంటారు. తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం (9th International Yoga Day) సందర్భంగా అందమైన ముద్దుగుమ్మలు యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోలు, ఫొటోలు షేర్ చేశారు.

ఫిట్ నెస్ చూపిస్తూ:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా (International Day of Yoga) టాలీవుడ్ టు బాలీవుడ్ తారలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది యోగా డే నిర్వహిస్తూ ఆసనాలు వేస్తున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ఏడాది కూడా బ్యూటిఫుల్ హీరోయిన్స్ యోగా చేస్తూ తమ ఫిట్ నెస్ చూపిస్తూ అందాలను ఆరబోశారు.
శిల్పా శెట్టి:ఫిట్ నెస్ ఫ్రీక్ లో ముందుగా గుర్తుకు వచ్చేది బాలీవుడ్ బ్యూటి శిల్పా శెట్టి. 48 ఏళ్ల వయుసులోను ఎంతో అందంగా, అంతకుమించిన ఫిట్ నెస్ తో అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా యోగా డే సందర్భంగా వీడియో షేర్ చేసిన ఈ బ్యూటి ఆసనాలు వేసి ఆకట్టుకుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్పోర్ట్స్ వేర్ లో అతికష్టమైన ఆసనాలు అవలీలగా వేస్తూ లెగ్స్ అందాలతో మెస్మరైజ్ చేసింది. అంతేకాకుండా యోగా ప్రత్యేకత చెబుతూ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్:2023 యోగా డే సందర్భంగా ఆసనాలతో అట్రాక్ట్ చేసిన మరో ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్. ఈ క్యూట్ బ్యూటి కెరీర్ తొలి నాళ్ల నుంచి ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్స్ తోపాటు యోగా రెగ్యులర్ గా చేసే ఈ భామ తాజాగా తాను వేసిన యోగాసానలతో ఉన్న వీడియోను షేర్ చేసింది. ఇందులో ఎంతో కష్టమైన ఆసనాలు వేసి ఆశ్చర్యపరిచింది. జీవితాన్ని బ్యాలెన్స్ చేసేది యోగా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
ప్రణీత సుభాష్:తెలుగులో బాపు బొమ్మగా పేరు తెచ్చుకుంది ప్రణీత సుభాష్. పాలరాతి శిల్పంలా మెరిసే ఈ బ్యూటి గ్లామర్ కు యోగా ఎంతగానో ఉపయోగపడుతందని చెబుతుంది. తాజాగా బ్లాక్ స్పోర్ట్స్ బ్రాలో 4 రకాల ఆసనాలు వేసి అందాలు ఆరబోసింది. "యోగా వల్ల గత ఏడాది నుంచి నాలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. హ్యాపీ యోగా డే" అని తెలిపింది ఈ సొట్టబుగ్గల సుందరి.
హన్సిక మోత్వానీ:దేశ ముదురు సినిమాతో తెలుగు యువత మనసులను కొల్లగొట్టిన పాల బుగ్గల సుందరి హన్సిక మోత్వానీ. ఇటీవలే పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటి తాజాగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మూడు రకాలైన ఆసనాలు వేసిన ఫొటోలు షేర్ చేసింది. బ్లూ కలర్ బ్రా, ట్రాక్ పాయింట్ లో ఆసనాలు వేస్తూనే అందాల విందు చేసింది. అలాగే యోగా డే విషెస్ తెలియజేసింది.
మలైక అరోరా:బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా కూడా ఎంత ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తుందో తెలిసిందే. తన గ్లామరస్ ఫిజిక్ కోసం ఎంతో కసరత్తులు చేస్తుంటుంది. ప్రతిరోజు ఉదయం జిమ్ లో తెగ కష్టపడుతూ అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తుంటుంది. ఇప్పుడు యోగా డే నేపథ్యంలో కూడా తాను చేసిన వివిధ ఆసనాల వీడియోను షేర్ చేసింది. ఇందులో కష్టమైన ఆసనాలతోపాటు అదిరే అందాలను చూపించింది.


Click it and Unblock the Notifications











