వినాయక నిమజ్జనం హీరోయిన్ చిందులు.. వైరల్ వీడియో
ప్రతీ ఏడాది దేశమంతా వినాయక ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరూరా, వాడ వాడ సంబరాలు మిన్నంటుతాయి. సాధారణ జనం మొదలుకొని, సెలెబ్రిటీల దాకా ఈ నవరాత్రి వినాయక ఉత్సవాల్లో మునిగితేలుతారు. దీంతో దేశంలో ఎక్కడ చూసినా మేళ తాళాలు, వాయిద్యాలు, డాన్సుల కోలాహాలం కనిపిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా సినీ ప్రముఖులు భక్తి శ్రద్దలతో ఈ ఉత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకుంటారు. తమ తమ ఇళ్లలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించుకొని భక్తి భావాలతో ఉంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కోవలోనే హీరోయిన్ శిల్పాశెట్టి కూడా తమ ఇంట్లో ఈ వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోనుంది. ఇంట్లో వినాయక పూజలు అయిన తర్వాత రోజు ఇంట్లో ఉన్న వినాయకుడిని నిమజ్జనం చేసింది. ఈ నిమిజ్జన కార్యక్రమంలో శిల్పాశెట్టి జోరుగా డాన్సులు చేసి తెగ సందడి చేసింది.

ఈ మేరకు తాను నిమిజ్జన కార్యక్రమంలో డాన్స్ చేస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పింది శిల్పాశెట్టి. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సహా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం శిల్పా శెట్టి.


Click it and Unblock the Notifications











