Don't Miss!
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మీరు అనున్నంత ఈజీ కాదు మా జీవితాలు.. భర్త గురించి చెబుతూ శివజ్యోతి కన్నీరు మున్నీరు
బిగ్ బాస్ షో వల్ల శివజ్యోతి బాగానే ఫేమస్ అయింది. అయితే అంతకు ముందు తీన్మార్ సావిత్రిగా తెలంగాణలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే సొంత పేరుతో మాత్రం బిగ్ బాస్ మూలానే గుర్తింపును సాధించుకుంది. అలా మూడో సీజన్ బిగ్ బాస్ వల్ల శివజ్యోతి బాగానే పాపులర్ అయింది. తన ఏడుపులతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాలను బెంబేలెత్తించింది. అలా ప్రతీ సీజన్‌లో ఓ క్యారెక్టర్ ఉంటుందని నిరూపించింది.

ప్రతీ సీజన్‌లోనూ..
ప్రతీ సీజన్‌లోనూ పాతాళగంగలను తలపించే కంటెస్టెంట్లు ఉంటారని అందరూ ఫిక్స్ అయ్యారు. మొదటి సీజన్‌లో మధుప్రియ, రెండో సీజన్‌లో దీప్తి సునయన, మూడో సీజన్‌లో శివజ్యోతి, నాల్గో సీజన్‌లొ మోనాల్ ఇలా అందరూ పాతాళగంగలా పేరుతెచ్చుకున్నారు. ఈ నలుగురు ప్రతీ చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ కన్నీరు కార్చేవారు.

శివజ్యోతి సైతం..
శివజ్యోతి ఏడ్చిన ఏడుపులు, వాటిపై వచ్చిన మీమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అదంతా గతం. కానీ తెరపై శివజ్యోతి కనిపించినప్పుడల్లా ఏడుపు మాత్రం కామన్ అన్నట్టుగా మారిపోయింది. తాజాగా ఆమె ఓ షోలో పాల్గొంది. అక్కడ కూడా ఎమోషనల్ అయింది.

అలాంటి కామెంట్లు..
తాజాగా శివజ్యోతి ఓ స్పెషల్ ఈవెంట్‌లో పాల్గొంది. అక్కడ తన భర్త మీద వచ్చే కామెంట్ల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. భార్య బాగా సంపాదిస్తుంది.. వాడికేంటి అని కొందరు బయట కామెంట్లు చేస్తుంటారని చెబుతూ ఎమోషనల్ శివజ్యోతి కన్నీరు పెట్టేసుకుంది.
Recommended Video

మహిళా దినోత్సవం..
మహిళా దినోత్సవం సందర్భంగా జీ తెలుగులో మగువా లోకానికి తెలుసా? నీ విలువా అనే ఓ స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. ఇందులో శివజ్యోతి స్పెషల్ గెస్ట్‌గా వచ్చింది. అందులో భాగంగా స్టేజ్ మీద మాట్లాడుతూ కన్నీరు పెట్టేసుకుంది.

అదే జరుగుతోంది..
నా తరుపున ఓ రిక్వెస్ట్ ఏంటంటే.. ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ఉందనుకోండి.. ఆమె ఎక్కువగా సంపాదిస్తుందనుకోండి.. తెలియకుండానే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ.. దానికేందిరా.. అది బాగానే సంపాదిస్తోంది.. దాని మొగుడు కూర్చుని తింటున్నాడు అని అంటారు.. మీరు అనుకున్నంత ఈజీ కాదు మా లైఫ్.. సపోర్ట్ చేసేవాళ్లను మీకు తెలియకుండానే.. కిందపడేస్తున్నారనిపిస్తోందంటూ శివజ్యోతి ఎమోషనల్ అయింది.