Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
బిగ్ బాస్ షో వల్ల కంటెస్టెంట్లు భారీగానే లాభపడుతున్నారు. అయితే కొందరికి నెగెటివిటీ ఎక్కువగా రావడంతో అలా కనిపించకుండా పోతుంటారు. కానీ దాదాపు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా ఫుల్ క్రేజ్‌తోనే బయటకు వస్తారు. అయితే ఆ క్రేజ్ వల్ల సినిమా అవకాశాలు వచ్చి స్టార్లుగా అయిపోతారన్న గ్యారెంటీ లేదు. కానీ బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫేమ్‌తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది.

సోషల్ మీడియాలో ఫేమస్..
బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వచ్చిన వారందరికీ అంతో ఇంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది. అలా వచ్చిన ఫాలోయింగ్ పెరిగిన క్రేజ్‌ను ఇంకా పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటారు

ఇంకొందరు అలా..
బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్, పెరిగిన ఫాలోవర్లను యూట్యూబ్ సబ్ స్క్రైబర్స్‌గా మార్చుకుంటారు. అలా బిగ్ బాస్ మూడు, నాలుగు కంటెస్టెంట్లందరూ కూడా యూట్యూబ్ చానెల్‌లుపెట్టేసి బిజీగా ఉంటున్నారు. శివజ్యోతి, లాస్య, మెహబూబ్, అరియానా ఇలా అందరూ కూడా అదే కోవకు చెందుతారు.

స్పెషల్ వీడియోలు..
శివజ్యోతి తన యూట్యూబ్ చానెల్‌లో వెరైటీ వెరైటీ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. నేతన్నతో ఒక రోజు.. స్ట్రీట్ ఫుడ్స్.. ఇలా స్పెషల్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోల్లో రవికృష్ణ ఉండటమో, తీయడమో చేస్తుంటాడు. అయితే శివజ్యోతి యూట్యూబ్ చానెల్‌కు 3 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ వచ్చారని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

నా కోసం..
మూడు లక్షల మంది సబ్ స్క్రైబర్స్ అయ్యారు యూట్యూబ్‌లో మనకు.. చాలా ప్రెజర్ ఉన్న జాబ్ యూట్యూబ్ అంటే.. కానీ నేను చేయగలుగుతున్నా అంటే గంగూలి వల్ల.. నీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే జీరో నుంచి మూడు లక్షల వరకు వచ్చాం.. నా కొడుకు రవికృష్ణకు పిక్స్, వీడియోలు అంటే ఇష్టం లేకపోయినా కూడా నా కోసం వీడియో చేశావ్ తీశావ్ అంటూ ఎమోషనల్ అయింది.