ఆచార్యలో ఆసక్తికరంగా రాంచరణ్, చిరంజీవి వార్: ఎమోషనల్ పాయింట్‌తో పోటాపోటీగా
స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. దాదాపు నలభై ఏళ్లుగా తెలుగులోని టాప్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభంలో బడా హీరోల నుంచి ఎదురైన పోటీని తట్టుకుని నిలబడిన ఆయన... ఎన్నో హిట్లను దక్కించుకుని ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక, ఈ మధ్యనే రీఎంట్రీ ఇచ్చిన చిరు.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా... కొన్ని ఆస్తుల విషయంలో కొడుకు రామ్ చరణ్‌తో ఆయన గొడవకు దిగారని తాజాగా ఓ వార్త లీకైంది. ఆ వివరాలు మీకోసం!

రీఎంట్రీలో జోరు చూపిస్తున్న చిరంజీవి
రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు పలు రికార్డులను బ్రేక్ చేసింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

హిట్ ట్రాక్ ఎక్కాలని బడా డైరెక్టర్‌తో..
తన గత చిత్రం అంత బాగా ఆడకపోవడంతో.. తదుపరి సినిమాపై బాగా ఫోకస్ చేశారు చిరంజీవి. ఇందులో భాగంగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో ‘ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. మ్యాట్నీ మూవీస్ సంస్థతో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు.

మళ్లీ అదే జోనర్.. ఈ సారి కొత్త మెసేజ్
కొరటాల శివ సినిమాలు అంటేనే సందేశాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు చిరంజీవితో చేసే ‘ఆచార్య'కూ అదే ఫాలో అవుతున్నారాయన. అయితే, ఈ సారి దేవాదాయ భూముల ఆక్రమణలపై ఆయన దృష్టి సారించారు. అంతేకాదు, ఇందులో చిరంజీవిని నక్సలైట్‌గా చూపించబోతున్నారు. కొద్ది రోజుల క్రితం నెట్‌లో లీకైన ఫొటోల వల్ల ఈ విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

చిరంజీవి సినిమా రామ్ చరణ్ కీలక పాత్ర
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ తర్వాత మహేశ్ బాబు పేరు తెరపైకి వచ్చింది. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదని, చిరంజీవి సినిమాలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మెగా మల్టీస్టారర్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

అతడే హీరో... ఆ ముప్పై నిమిషాలు కేక
ఈ సినిమా గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన విషయాల ఆధారంగా ఇందులో రామ్ చరణ్ చేసేది అత్యంత ముఖ్యమైన పాత్ర అని అర్థం అవుతోంది. దాదాపు ముప్పై నిమిషాలు పాటు ఉండే ఆ పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా చిరంజీవి - రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయని ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ - చిరంజీవి మధ్య భీకర పోరు
తాజాగా ఈ సినిమా గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ - చిరంజీవి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందనేదే ఆ వార్త సారాంశం. చెర్రీ కనిపించే ముప్పై నిమిషాల్లో ఇదే ముఖ్యమైనది అని సమాచారం. అడవుల్లో ఈ ఎపిసోడ్ చిత్రీకరణ జరగాల్సి ఉందట. అయితే, కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆ ఆస్తుల కోసమే తండ్రీ కొడుకులకు ఈ పరిస్థితి.!
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో చిరంజీవి అండర్ కవర్ అధికారిగా కనిపించబోతున్నాడట. దేవాదాయ శాఖలో పని చేస్తూ ఆపరేషన్ చేస్తాడట. నక్సలైట్ అయిన రామ్ చరణ్‌ను పట్టుకోడానికి అతడు ప్రయత్నాలు చేస్తుంటాడట. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్తులైన దేవాదాయ భూముల గురించి ఈ ఇద్దరి మధ్య పోరాటం ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











