మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: పవన్ రీఎంట్రీ ఇప్పట్లో లేనట్లే.. నిర్మాతకు చెప్పేశాడు.!

By Manoj

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఈయన.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. స్టైల్, యాక్టింగ్‌లో విభిన్నమైన శైలితో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోగా ఎదిగిన పవన్.. సామాజిక సేవలోనూ ముందుంటారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయన.. కొద్ది రోజుల క్రితం రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. అంతేకాదు, ఓ పార్టీని కూడా స్థాపించారు. ఇక, అప్పటి నుంచి ఆయన సినిమాలకు దూరం అయ్యారు. కానీ, కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే..

దిల్ రాజు బ్యానర్ ద్వారా రీఎంట్రీ

దిల్ రాజు బ్యానర్ ద్వారా రీఎంట్రీ

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు బ్యానర్ ద్వారా పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అది కూడా బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న ‘పింక్' సినిమా రీమేక్‌తో అని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా అభిమానులు ఖుషీలో మునిగి తేలుతున్నారు.

నిర్మాతలపై పవన్ సీరియస్

నిర్మాతలపై పవన్ సీరియస్

పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు బయటకు వచ్చిన సమయంలో ఓ ఆసక్తికర విషయం కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. తన రీఎంట్రీ గురించి ప్రకటించిన నిర్మాతలపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారనేదే ఆ వార్త సారాంశం. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది.

ఆయన ప్రకటనతో క్లారిటీ

ఆయన ప్రకటనతో క్లారిటీ

పవన్ కల్యాణ్ రీఎంట్రీ వార్త అటు చిత్ర పరిశ్రమలోనూ.. ఇటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై దిల్ రాజు స్పందించారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పవన్ గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. ‘పింక్' రీమేక్ మూవీ ద్వారా ఆయన రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు షూటింగ్ ప్రారంభిస్తాం' అని చెప్పారు.

సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభం

సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభం

పవన్ కల్యాణ్ డేట్స్ కోసం దిల్ రాజు వేచి చూస్తున్నారని వార్తలు వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతోంది. ఈ సినిమా జనవరి చివరి వారంలో ప్రారంభం అవుతుందని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం డైరెక్టర్ వేణు శ్రీరామ్ స్క్రిప్టు వర్క్ చేస్తున్నారని, అదే సమయంలో సంక్రాంతి పండుగ హడావిడి అయిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుందని ప్రచారం జరిగింది.

 దానిపై పవన్ కల్యాణ్ అఇష్టత

దానిపై పవన్ కల్యాణ్ అఇష్టత

‘పింక్' రీమేక్‌కు విషయంలో పవన్ కల్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఇప్పటికే హిందీ, తమిళంలో విడుదలైంది. దాదాపుగా తెలుగు వారికి కూడా ఈ కథ గురించి తెలుసు. కాబట్టి, తెలిసిన కథతో కాకుండా కొత్త దానిని ట్రై చేద్దాం అని పవన్.. దిల్ రాజుకు సూచించారని సమాచారం.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
రీఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా.!

రీఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా.!

పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని వస్తున్న వార్తలకు ఇప్పుడు భిన్నమైన ప్రచారం జరుగుతుండడంతో మెగా అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన వార్త కనుక నిజం అయితే.. పవన్ రీఎంట్రీ వాయిదా పడినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X