twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరణ్ చేతిలో దెబ్బలు తిన్న ఎన్టీఆర్.. లీక్ చేసిన సీనియర్ నటుడు.. తెరపైకి పలు అనుమానాలు.!

    By Manoj
    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీనికితోడు 'బాహుబలి' సిరీస్ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో RRR గురించి తరచూ ఏదో ఒక వార్త సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఇందులో నటిస్తున్న ఇద్దరు హీరోల మధ్య జరిగిన ఓ సీన్ గురించి లీక్ అయింది. ఆ సంగతులేంటో చూద్దాం.!

     ఆ ఇద్దరి నిర్ణయంతో చాలా మంది కలిశారు

    ఆ ఇద్దరి నిర్ణయంతో చాలా మంది కలిశారు

    రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించాలని నిర్ణయించుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్‌లోని రెండు బడా ఫ్యామిలీలకు చెందిన హీరోలు కావడంతో అందరూ దీని గురించే చర్చించుకున్నారు. వీళ్లిద్దరూ తీసుకున్న నిర్ణయంతో అప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న మెగా, నందమూరి ఫ్యాన్స్ కలిసిపోయారు.

     రాజమౌళి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు.?

    రాజమౌళి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు.?

    2టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీలు ఇప్పుడిప్పుడే ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే, RRRలో ఏ హీరోకు ఎక్కువ సీన్లు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మూవీలో రామ్ చరణ్ కంటే తారక్ పార్టే ఎక్కువ అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

     ఇద్దరి ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేశాడు

    ఇద్దరి ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేశాడు

    సినిమా మొత్తంలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న చర్చ జరుగుతున్న సమయంలోనే.. ఇద్దరు హీరోల ఎంట్రీలకు సంబంధించిన పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ ఎంట్రీ పులి ఫైట్‌తో ఆరంభం అవుతుందనే టాక్ కొద్ది రోజులుగా వినిపిస్తోంది. అలాగే, రామ్ చరణ్‌ ఎంట్రీ కూడా అదిరిపోయే ఫైట్‌తో ఆరంభం అవుతుందని అంటున్నారు.

    చరణ్ చేతిలో దెబ్బలు తిన్న జూనియర్

    చరణ్ చేతిలో దెబ్బలు తిన్న జూనియర్

    తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో ఓ సందర్భంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న రామ్ చరణ్.. కొమరం భీమ్‌లా కనిపించనున్న తారక్‌ను కొడతాడట. ఈ సీన్ మొత్తం సినిమాకే హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం.

    ఆయన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసింది

    ఆయన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసింది

    ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో నటించిన ఓ సీనియర్ ఆర్టిస్టు ఇటీవల యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్భంగా RRR మూవీకి సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగానే చరణ్.. తారక్‌ను కొట్టే సీన్ గురించి లీక్ చేశాడు. ‘ఆ సీన్ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్నా. చాలా బాగా వచ్చింది' అని ఆయన చెప్పుకొచ్చాడు.

     లీకుతో తెరపైకి పలు అనుమానాలు.!

    లీకుతో తెరపైకి పలు అనుమానాలు.!

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన సీన్ గురించి లీక్ అయిన వెంటనే పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. చరణ్.. తారక్‌ను కొడితే నందమూరి ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా.? ఒక హీరో డామినేటింగ్ సీన్ థియేటర్‌లో పేలుతుందా.? ఈ సీన్‌తో ఫ్యాన్స్ మధ్య వైరుధ్యాలు వస్తాయా.? అని పలువురు చర్చించుకుంటున్నారు.

    English summary
    RRR is an upcoming 2021 Indian Telugu-language period action film written and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan, Alia Bhatt and Ajay Devgn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X