శ్రద్దా దాస్ అందాలకు నిజంగా దాసులవ్వాల్సిందే.. అద్దం ముందు వయ్యారాల విందు!!
టాలీవుడ్‌లో తళుక్కున మెరిసి మాయమైన అందం శ్రద్దాదాస్. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అంటూ అల్లరి నరేష్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆర్య 2 సినిమాతో మొదటి సారిగా హిట్ కొట్టింది. అందాలను ఆరబోయడం, బోల్డ్‌గా నటించడంతో శ్రద్దా దాస్ బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు శ్రద్దాకు సినిమాలేవీ లేకపోయినా సరే సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ నెట్టుకొచ్చేస్తోంది.

బిగ్ బాస్ షోలో..
ఇక బిగ్ బాస్ షో నాల్గో సీజన్ కంటెస్టెంట్‌గా శ్రద్దా దాస్ రాబోతోందని అప్పట్లో రూమర్లు బాగానే వచ్చాయి. అసలు అయితే మూడో సీజన్‌కు వస్తుందని అంతా భావించారు. కానీ రాలేదు. నాల్గో సీజన్‌లో పక్కా అంటూ గాసిప్స్ వచ్చాయి. చివరకు శ్రద్దా వాటిని కొట్టి పారేయడంతో రూమర్లు ఆగిపోయాయి.

వివాదాల్లోనూ..
సుశాంత్ సింగ్ మరణం తరువాత నెపోటిజంపై జరిగిన చర్చలను చూసి విసిగిపోయిన శ్రద్దా దాస్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నెపోటిజమనేది ప్రతీ రంగంలోనూ అలానే ఉంటుందని చాలామంది అంటున్నారు. తల్లీదండ్రులు వారి వారసత్వాన్ని కొడుకులకు ఇస్తారని చెబుతున్నారు. అయితే మా పేరెంట్స్ డాక్టర్స్, ఇంజనీర్స్ అయితే.. ఎలాంటి పరీక్షలు లేకుండా డైరెక్ట్‌గా అవ్వగలనా? అని ప్రశ్నించింది.

అప్పుడు అలా..
లాక్డౌన్ మధ్యలో శ్రద్దా దాస్ బికినీలో అందాలను ఆరబోసింది. స్విమ్ సూట్ స్పెషల్ ఫోటో షూట్ చేసినట్టు కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. అవి ఆ సమయంలో నెట్టింట్లో మంట రేపాయి. తాజాగా మరోసారి నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు అందాల ప్రదర్శనకు తెరలేపింది.
Recommended Video

అద్దం ముందు..
ఈ మధ్య హీరోయిన్లందరూ కూడా మిర్రర్ సెల్ఫీలపై శ్రద్ద చూపిస్తున్నారు. తాజాగా శ్రద్దా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నడుము, నాభి, ఎద అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించేసింది. బికినీలో శ్రద్దా సోయగాలు ఇప్పుడు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











