ఆ ప్రేమకు ఫిదా.. చల్లని వేళ సాగర తీరాన.. బికినీలో శ్రద్దా కపూర్ రచ్చ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వారసత్వపు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా కూడా తన కంటూ ఓ ముద్రను వేసుకుంది. నటన, డ్యాన్సుల్లో శ్రద్దా కపూర్ తన సత్తాను చాటింది. అతి కొద్ది కాలంలోనే లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాకుండా ఏకంగా ప్రభాస్ పక్కన సాహోలో నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైంది.

బాలీవుడ్‌లో అలా..
బాలీవుడ్‌లో ప్రస్తుతం అలియా భట్, శ్రద్దా కపూర్ శకం నడుస్తోంది. ఈ ఇద్దరికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. పాన్ ఇండియన్ హీరోయిన్స్‌గా శ్రద్దా కపూర్, అలియా భట్‌లు ఇండియన్ స్క్రీన్‌ను ఏలేస్తున్నారు. అందం మాత్రమే కాకుండా అద్భుతమైన నటనను కనబరుస్తూ దూసుకుపోతోన్నారు.

లేడీ ఓరియెంటెడ్..
శ్రద్దా కపూర్ ఆషికి 2 సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు వెల్లివెత్తాయి. ఇక ఆమె చేసే మెరుపుల్లాంటి డ్యాన్సులు చూసి అందరూ ఫిదా అయ్యారు. స్త్రీ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కొల్లగొట్టేసింది శ్రద్దా కపూర్.

సాహెతో అలా..
అయితే ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాతో దక్షిణాదిన కూడా పాగా వేద్దామని ప్రయత్నించింది శ్రద్దా కపూర్. కానీ ఆ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అందుకే మళ్లీ దక్షిణాది వైపు శ్రద్దా కపూర్ కన్నెత్తి కూడా చూడటం లేదు. అయినా ఈ భామకు మాత్రం ఇక్కడ ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

బర్త్ డే సందర్భంగా..
ఇక శ్రద్దా కపూర్ బర్త్ డే (మార్చి 3) సందర్భంగా విషెస్ వెల్లువెత్తాయి. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అభిమానులందరూ కూడా విషెస్ అందజేశారు. అయితే ఫ్యాన్స్ కురిపించిన ప్రేమకు శ్రద్దా కపూర్ ఫిదా అయింది. ఈ మేరకు శ్రద్దా ఓ పోస్ట్ చేసింది.

బికినీలో అలా..
బికినీలో అలా నిల్చుని.. సాయంకాలం వేళ సముద్ర తీరాన్ని వీక్షించిస్తోంది శ్రద్దా కపూర్. తనపై ఇంతలా ప్రేమ కురిపించినందుకు, బర్త్ డే విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇలా హాట్‌గా కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. శ్రద్దా కపూర్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంది. రోహన్ అనే వ్యక్తితో శ్రద్దా కపూర్ పెళ్లి జరగనుందనే రూమర్లు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











