శ్రీ రెడ్డి గురించి వర్మ అలా అనేశాడట.. అందుకే టైటిల్స్‌లో పేరు మార్చాడన్న ‘నగ్నం’ బ్యూటీ
రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య మీటూ, క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తోన్న క్రమంలో శ్రీ రెడ్డిని పక్కదారి పట్టించాడు వర్మ. ఆయన చెప్పినట్టుగా చేసి చెడ్డపేరును మూటగట్టుకుంది. వర్మ అడుగుజాడల్లో నడవడంతో అప్పటి వరకు చేసిన పోరాటం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా అయింది. అప్పటి నుంచి వర్మ, శ్రీరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. శ్రీ రెడ్డి మీద వర్మకు ఉన్న అభిప్రాయాన్ని తాజాగా నగ్నం ఫేమ్ శ్రీ రాపాక బయట పెట్టింది.

‘నగ్నం’తో ఫేమ్..
లాక్ డౌన్‌లో ఆర్జీవీ వరుస చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా నగ్నం అందర్నీ షాక్‌కు గురి చేశాడు. తెలుగు ప్రేక్షకులకు వర్మ కొత్త అందాన్ని పరిచయం చేశాడు. శ్రీ రాపాకను స్వీటీగా వర్మ పరిచయం చేశాడు. అయితే శ్రీరాపాకగా ఉన్న తన పేరును స్వీటీగా మార్చడం వెనుక పెద్ద కథే ఉందంటా.

శ్రీ అనే పేరు ఇష్టం..
శ్రీ రాపాక ఈ విషయంపై తాజాగా స్పందించింది. తనకు శ్రీ అనే పేరు చాలా ఇష్టమని, అందరూ శ్రీ అనే పిలుస్తారని చెప్పుకొచ్చింది. ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతారని, శ్రీ అంటే ఎవ్వరూ నమ్మరని పక్కన ఇంకా ఏదైనా పేరు ఉందా? అని అడుగుతారని పేర్కొంది. అయితే తనకు శ్రీ అంటేనే ఇష్టమని తెలిపింది.

వర్మ అలా అన్నాడు..
మొదటగా వర్మతో మీటింగ్ అయినప్పుడు జరిగిన సంగతిని శ్రీ రాపాక వివరించింది. ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు వర్మ తన పేరు అడిగాడని, శ్రీ అని చెప్పడంతో వింతగా చూశాడని చెప్పుకొచ్చింది. శ్రీ రాపాక అనడంతో నచ్చలేదని, పేరు మార్చుకోమ్మని సూచించాడని తెలిపింది. ఎందుకు అని ఎదురు ప్రశ్నించగా.. తనకు శ్రీ అనే పేరు నచ్చదని, శ్రీ రెడ్డి అంటేనే నచ్చదనే సమాధానం ఇచ్చాడట.

శృంగారీ అంటూ..
పేరును మార్చుకోమంటే తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. టైటిల్స్‌లో మాత్రం మార్చేస్తానని వర్మ అన్నట్టుగా పేర్కొంది. మొదట శృంగారీ అనే పేరును సూచించారని, చీచీ అది వద్దని చెప్పడంతో స్వీటీగా ఫిక్స్ చేశారని అసలు గుట్టును విప్పింది. తనను మొదటి నుంచి స్వీటీ అని పిలిచాడని, టైటిల్‌లోనూ స్వీటీగానే వేశారని పేర్కొంది.


Click it and Unblock the Notifications











