మాతృత్వం గొప్పదనమిదే.. గర్భాన్ని చూసి మురిసిపోతోన్న శ్రేయా ఘోషాల్
సింగర్ శ్రేయా ఘోషాల్ తెలియని తెలుగు సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. కొన్ని ఏళ్లుగా శ్రేయా ఘోషాల్ గొంతును వింటూనే వస్తున్నారు. తెలుగులో మెలోడీ సాంగ్ పాడాలంటే కచ్చితంగా శ్రేయా ఘోషాల్‌ను సంప్రదించాల్సిందే. దాదాపు ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లందరి దగ్గరా శ్రేయా ఘోషాలో పాడేసింది. మరీ ముఖ్యంగా మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్‌ల సారథ్యంలో ఎన్నో సూపర్ మెలోడీలను పాడేసింది.

నేషనల్ వైడ్..
శ్రేయా ఘోషాల్ స్వరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆమెకు నేషనల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ భాషలో పాట పాడినా సరే.. అక్కడి నేటివిటీకి తగ్గట్టే ఉంటుంది. తెలుగు పాటలు పాడితే.. తెలుగమ్మాయిలానే అచ్చంగా, స్వచ్చంగా పాడుతుంది. అలాంటి శ్రేయా ఘోషాల్ ఇప్పుడు తల్లి కాబోతోంది.
క్లీవేజ్ షోతో హల్చల్.. నిక్కీ తంబోలి రచ్చ

పర్సనల్ లైఫ్..
మామూలుగా శ్రేయా ఘోషాల్ తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడదు. సోషల్ మీడియాలోనూ తన వృత్తి పరమైన విషయాలు తప్పా ఎక్కువగా వ్యక్తిగత విషయాలను పంచుకోదు. కానీ గత మూడు వారాల క్రితం ఓ శుభవార్త చెప్పింది. తమ జీవితంలోకి ఓ కొత్త సంతోషం రాబోతోందని చెప్పుకొచ్చింది.

తల్లి కాబోతోన్నానంటూ..
మా బేబీ త్వరలోనే రాబోతోంది.. నేను, శీలాదిత్య ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.. మా ఈ జీవితంలో కొత్త ఆనందాన్ని ఆహ్వానించే వేళ మీ అందరి ప్రేమ, ఆశీర్వదం మాకు కావాలి అంటూ శ్రేయా ఘోషాల్ చేసిన పోస్ట్ వైరల్ అయింది.

తాజాగా అలా...
అయితే తాజాగా తన గర్భాన్ని చూసుకుని శ్రేయా ఘోషాల్ మురిసిపోయింది. మాతృత్వంలోని గొప్పదనాన్ని అనుభవిస్తూ లోకాన్ని మైమరిచిపోయినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు శ్రేయా ఘోషాల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నా జీవితంలోని అద్బుతమైన దశను అనుభవిస్తున్నాను. ఇది దేవుడు అద్భుతమైన లీల అంటూ శ్రేయా ఘోషాల్ ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











