నిర్మాతతో మందు, చిందు.. ఆ రోజులు గుర్తు చేసుకుంటూ.. శ్రియ ఫోటోలు వైరల్

తెలుగులో దశాబ్దం కాలంపాటు స్టార్ స్టేటస్‌ను అనుభవించింది శ్రియా. తెలుగులో కుర్ర హీరోలతో మొదలుపెట్టి సీనియర్ హీరోలందరితో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటివారికి సరిజోడుగా అనిపించుకున్న శ్రియా.. కుర్ర హీరోలతోనూ ఆడిపాడింది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్ వంటివారితోనూ ఎన్నో బ్లాక్ బస్టర్‌ చిత్రాలను చేసింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు శ్రియ డేట్స్ దొరకడం కూడా కష్టతరంగా మారింది. అంతలా బిజీగా ఉన్న శ్రియా ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిలైంది.

సెకండ్ ఇన్నింగ్స్..

సెకండ్ ఇన్నింగ్స్..

ఒకానొక సమయంలో శ్రియా స్టార్ స్టేటస్ పడిపోయింది. కుర్ర హీరోయిన్‌ల తాకిడి ఎక్కువ అవడంతో శ్రియా కాస్త వెనకబడింది. అయితే సీనియర్ హీరోలకు మాత్రం సరైన జోడి అని నిరూపించుకుంది. ఆ మధ్య గోపాల గోపాల చిత్రం వెంకటేష్ సరసన, పైసా వసూల్ చిత్రంలో బాలయ్య సరసన నటించి మెప్పించింది.

పెళ్లితో గ్యాప్..

పెళ్లితో గ్యాప్..

రష్యాకు చెందిన ఆండ్రీ కొచ్చివ్‌తో ప్రేమాయణం నడిపించిన శ్రియా 2018లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం అక్కడే అత్తవారింట్లోనే ఉంటోంది. రష్యాలో ఉంటున్నా.. తన ఫ్యాన్స్‌కు మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటుంది. ఆమె తన భర్తను కూడా అభిమానులకు కూడా దగ్గర చేసింది. నిత్యం ఏదో ఒక పోస్ట్, వీడియో షేర్ చేయడంతో ఆండ్రూ కూడా అందరికీ దగ్గరయ్యాడు.

లాక్ డౌన్‌లో సందడి..

లాక్ డౌన్‌లో సందడి..

లాక్ డౌన్ కాలంలో శ్రియా తన భర్తను బాగానే ఏడిపించినట్టు కనిపించింది. ఇంట్లో అన్ని పనులు అతనితోనే చేయించింది. ఈ మేరకు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా లాక్ డౌన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ ఇద్దరూ ఎంతో ఫన్నీగా అవగాహన కల్పించారు.

Recommended Video

RRR Movie Update : SS Rajamouli Serious On Shriya Saran
నాటి ఫోటో..

నాటి ఫోటో..

తాజాగా శ్రియా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో లండన్‌లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంది. ఆ ఫోటోలో బాలీవుడ్ ప్రొడ్యూసర్‌ తనూజ్ గర్గ్‌తో ఎంతో సన్నిహితంగా ఉంది. నాటి రోజు, తాగి ఎంజాయ్ చేసిన ఆ రాత్రులు అంటూ క్యాప్షన్ పెట్టి ఉంది. ఇక ఈ ఫోటోలో శ్రియా సైతం ఎంతో హాట్ ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X