అందాల శ్రీయకు హ్యాపీ బర్త్ డే.. గతంలో ఎన్నడూ చూడని క్లీవేజ్ సొగసులు.. వైరల్ పిక్స్
Recommended Video
సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఈ రోజు (సెప్టెంబర్ 11) శ్రీయ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలు, సోషల్ మీడియా హాట్ హిస్టరీ చూద్దామా..

'ఇష్టం' సినిమాతో తెలుగు తెరపై
'ఇష్టం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీయ. మొదటి సినిమాతోనే అందరికీ ఇష్టమైన హీరోయిన్‌గా మారి గత కొన్నేళ్లుగా టాలీవుడ్ తెరపై ఓ వెలుగు వెలుగుతోంది.

రెండు తరాల అగ్ర హీరోలతో
తెలుగులో రెండు తరాల అగ్ర హీరోలతో ఆడిపాడింది శ్రీయ. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌ల సరసన నటించి మెప్పించిన ఈమె.. వారితో కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

యూత్ ఆడియన్స్‌కి గ్యాలం
ఇక నేటితరం హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో నటించి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది.

రజినీకాంత్ సరసన
తెలుగులో టాప్ హీరోయిన్‌గా కీర్తించబడిన ఈమె.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కూడా నటించింది. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివాజీ' మూవీలో హీరోయిన్‌గా నటించి వావ్ అనిపించింది.

బాలీవుడ్ లోనూ
ఇలా తెలుగు, తమిళంలో ఓ వెలుగు వెలుగుతూనే బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. కానీ అక్కడ ఆమెకు పెద్దగా కలిసి రాకపోవడంతో తిరిగి టాలీవుడ్ వైపు చూసింది.

‘మనం’ సినిమాలో
ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన ‘మనం' సినిమాలో శ్రీయకు ఛాన్స్ రావడంతో, తిరిగి తెలుగులో మళ్లీ బిజీ బిజీ అయింది.

హీరోయిన్ కాకముందు ముందు నుంచే
హీరోయిన్ కాకముందు ముందు నుంచే శ్రీయకు కెమెరాతో అనుబంధం ఉంది. వెండితెరపై కాలుమోపక ముందే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా కెమెరా ముందుకొచ్చింది శ్రీయ.

కెరీర్ వైపు అడుగులు
1982 సెప్టెంబర్ 11న డెహ్రాడూన్‌లో జన్మించింది శ్రీయ. ఆ తర్వాత వీరి కుటుంబం ఢిల్లికి షిప్ట్ అయింది. అక్కడే ఆమె కెరీర్ వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేసింది.

లేటు వయసులో పెళ్లి
లేటు వయసులో గతేడాదే పెళ్లి చేసుకున్న శ్రీయ శరణ్ ప్రస్తుతం తన భర్తతో తెగ షికారు చేస్తోంది. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా సెన్సేషన్ అవుతోంది శ్రీయ.

బికినీ లుక్స్
హాట్ హాట్ ఫోజులిస్తూ సోషల్ మీడియా సెగలు పుట్టిస్తోంది. ఈ మేరకు బికినీ లుక్స్ పోస్ట్ చేస్తూ షాకిస్తోంది. ఈ వయసులో కూడా తన అందాలతో మాయ చేస్తూ అబ్బురపరుస్తోంది.


Click it and Unblock the Notifications











