రష్యన్ వ్యక్తితో శ్రియా సరన్ ప్రేమకథ.. స్టార్ హీరోయిన్ కూ ఇలాంటి పరిస్థితా?

స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. చలనచిత్ర పరిశ్రమలోని రెండో తరం హీరోలకు నటిగా చాలా సినిమాలు చేసింది. ఇప్పటికీ ఇండస్ట్రీలోని సీనియర్ మోస్ట్ హీరోలకు జోడీగా నటిస్తూ వెండితెరపై అలరిస్తున్నవిషయం తెలిసిందే. 23 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గానే ఉంటోంది. తెలుగు చిత్రం 'ఇష్టం' మూవీతో తెరంగేట్రం చేసిన శ్రియా శరణ్ ఆ తర్వాత అతికొద్ది సమయంలోనే వరుస పెట్టి సినిమా ఆఫర్లను అందుకుంది. నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలక్రిష్ణ, తరుణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోలకు జోడీగా నటించింది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

అలాగే.. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా శ్రియా శరణ్ తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో వేదికన కుటుంబంతో కలిసి నిత్యం సందడి చేస్తున్న విషయం తెలిసిందే... అయితే శ్రియా శరణ్ విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌ ను 2018లో పెళ్లి చేసుకుంది. అయితే శ్రియా లవ్ స్టోరీ గురించి మాత్రం అంతగా ఎవ్వరికీ తెలియదు. ఫిబ్రవరి 14th ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రియా శరన్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

Shriya Saran Interesting Love Story with Andrei Koscheev Valentine s Day 2025 Special Story

శ్రియా శరణ్ మొదటగా ఆండ్రీ కోస్చీవ్‌ ని మాల్దీవ్స్ లో కలిసిందని తనే ఓ సందర్భంలో చెప్పింది. వారిద్దరూ మొదట కలిసినప్పుడు శ్రియా శరణ్ ఎవరో.. ఏం చేస్తుందో ఆండ్రీకి ఏమాత్రం తెలియదంట. శ్రియా గురించి తెలియకుండానే ప్రేమలో పడిపోయాడంట. ఆ తర్వాత తను నటి అని తెలుసుకున్నాడంట. అయితే 2004 నుంచే ఆండ్రీతో శ్రియా శరణ్ కు పరిచయం ఉందంట. ఏకంగా 14 ఏళ్ల పాటు వీరు రిలేషన్ షిప్ లోనే ఉన్నారు. కానీ పెళ్లి వరకూ ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక శ్రియా శరణ్ సినిమా షూటింగ్స్ అన్నీ ప్లేసులకు ఆండ్రీనే కారులో తీసుకెళ్లేవాడంట.

ఇక వీరిద్దరి పెళ్లికి ఆండ్రీ కోస్చీవ్‌ వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదంట. దీంతో వీరు ఎవరికీ చెప్పకుండానే వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారంట. శ్రియా శరణ్ తల్లిదండ్రులు ముంబైలోనే ఉండటంతో ఆండ్రీతో ఇండియాలోనే హిందూ సంప్రదాయం ప్రకారం శ్రియా శరణ్ వివాహం జరిగింది. ఆ తర్వాత 2021 జనవరి 10న వీరు పండంటికి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. చిన్నారి పేరు రాధా శరణ్ కోస్చీవ్. ఇక శ్రియా తరుచూగా కూతురు, భర్త ఆండ్రీతో కలిసి టూర్లు, వెకేషన్లకు వెళ్తూ సందడి చేస్తుంటుంది. షూటింగ్ లేకుంటే మాత్రం ఎప్పుడూ కుటుంబంతోనే కలిసి ఉంటుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వారిని కూడా ఖుషి చేస్తుంటుంది.

ఇక శ్రియా శరణ్ 2001 లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. అప్పటి నుండి ఆమె నటించిన చిత్రాలు దాదాపు గా విజయాన్ని వరించడం విశేషం. ప్రస్తుతం 42 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ ఈ ముదురు భాగ ఇంకా వెండితెరపై మెరుస్తూ వస్తోంది. 'ఆర్ఆర్ఆర్', 'దృశ్యం' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో మెరుస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X