పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
శ్రియా తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాలుగు గోడల మధ్య ఎంతటి రొమాన్స్ చేస్తారో.. నడి వీధుల్లోనూ శ్రియా అలానే చేస్తుంది. భర్తను ముద్దుల్లో ముంచెత్తుతుంది. చుట్టూ ఎలా ఉన్నా కూడా శ్రియా మాత్రం తన లోకంలో తానే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో భర్తను ఎంత ఘాడంగా రొమాన్స్‌లో ముంచెత్తుతుందో వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం అలా..
ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపింది శ్రియా. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరితో నటించింది.. బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి శ్రియా ఇప్పుడు తెరపై అంతగా కనిపించడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే శ్రియా పెళ్లి చేసుకుంది.

రష్యలో సెటిల్..
రష్యన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న శ్రియా అక్కడే సెటిల్ అయింది. ఇక రష్యా వీధుల్లో శ్రియా చేసే అల్లరి ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. నడి రోడ్డు మీద శ్రియా రచ్చ రచ్చ చేస్తుంటుంది. భర్తతో కలిసి డ్యాన్సులు వేస్తూ రొమాన్స్ చేస్తుంటుంది.

లాక్డౌన్‌లో రచ్చ..
ఇక లాక్డౌన్ సమయంలో అయితే ఆండ్రూని శ్రియా ఓ ఆట ఆడుకుంది. ఇంట్లోని పనులన్నీ కూడా అతనితో చేయించింది. ఇక ముద్దులు, హగ్గులు ఇస్తూ షేర్ చేసిన వీడియోలను చూసి సోషల్ మీడియా కూడా హీటెక్కిపోయింది. అయితే ఈ మధ్యే మళ్లీ ఈ జంట హాట్ టాపిక్ అయింది.

మచ్చు పిచ్చు..
మచ్చు పిచ్చులను చూసేందుకు అలా వెకేషన్స్‌కు వెళ్లింది ఈ జంట. అక్కడ శ్రియా ఆ జంతువులను దీర్ఘం చూస్తుంటే.. అందులోంచి ఒకటి మాత్రం దూసుకెళ్లింది. అలా దూసుకెళ్లడం చూసి తన మీదకు వస్తోందేమో అని శ్రియా హడలిపోయింది. దెబ్బకు భర్త ఒళ్లో వాలింది. అలా ఆ వీడియో బాగానే వైరల్ అయింది.

తాజాగా ఇలా..
అయితే తాజాగా శ్రియా మరోసారి రచ్చ చేసింది. పబ్లిక్ ప్లేస్‌లోనే ఘాటు ముద్దులతో రెచ్చిపోయింది. మాస్క్‌లు తీసుకుని అలా లిప్ లాక్ పెట్టేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రియా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది.


Click it and Unblock the Notifications











