రేసుగుర్రం, గబ్బర్ సింగ్ గురించి అంత మాట అనేసిందా?.. క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. అయితే తెలుగులో అనగనగా ఓ ధీరుడు వంటి చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది. ఆ వెంటనే ఓ మై ఫ్రెండ్ అనే మరో చిత్రంతో పలకరించింది. అది కూడా బోల్తా కొట్టింది. ఇక శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నిలబడటం కష్టమే అనుకున్న సమయంలో గబ్బర్ సింగ్ ఆఫర్ వచ్చింది. ఈ ఒక్క చిత్రం శ్రుతి హాసన్‌ను ఎక్కడో నిలబెట్టింది.

గోల్డెన్ హ్యాండ్..
గబ్బర్ సింగ్ కంటే ముందు శ్రుతి హాసన్‌ను ఐరెన్ లెగ్ అని ముద్ర వేయించుకున్న శ్రుతి హాసన్‌కు గబ్బర్ సింగ్ అవకాశం రావడం, అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, అందులో శ్రుతి హాసన్ అందర్నీ ఆకట్టుకోవడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆపై తెలుగులోనే కాకుండా ఏకంగా సౌత్ మొత్తం పాపులార్టీ వచ్చేసింది. ఇక రేసుగుర్రం సినిమాతో మరో స్థాయికి వెళ్లింది.

తాజాగా అలా అనేసింది..
చాలా మంది కమర్షియల్ సినిమాలే చేయాలని చెప్పారు.. కానీ అది నేను ఎక్కువ కాలం వినలేదు. నేను కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను. కానీ అవి చేస్తోన్న సమయంలో నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఇక నుంచి నేను మంచి చాయిస్‌లను నిజాయితీగా తీసుకుంటాను అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.

తప్పుగా వక్రీకరించారట..
అయితే శ్రుతి హాసన్ చెప్పిన ఆ మాటలను గమనిస్తే.. అందులో బ్లాక్ బస్టర్ అని అనడంతో అవి కచ్చితంగా గబ్బర్ సింగ్, రేసుగుర్రం చిత్రాలే అయి ఉంటాయని మన తెలుగు మీడియా, ప్రేక్షకలు, నెటిజన్లు అనుకున్నారు. అనుకుంటారు కూడా. అయితే అసలు నిజం అది కాదట. తాజాగా తనపై ఈ విషయంలో ట్రోలింగ్ జరుగుతుండటంతో శ్రుతి హాసన్ స్పందించింది.

అలా అనలేదు..
కొన్ని తెలుగు మీడియా సంస్థలు నేను జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించి రాశారు. కానీ అవి నిజం కాదు. రేసుగుర్రం, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో నేను నటించడం ఎంతో గర్వకారణం.. పైగా పవన్ కళ్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్.. నా లైఫ్‌ను చేంజ్ చేసింది. తెలుగు, దక్షిణాది చిత్ర సీమలో భాగస్వామిని అవ్వడం నా హృదయంలో ఓ పార్ట్ అవ్వడం లాంటిది. నిజం. ఆ ఇంటర్వ్యూలో అన్న మాటల సందర్భం వేరు. సౌత్ నార్త్‌లో నేను చేసిన చిత్రాల గురించి మాట్లాడుతూ.. హిందీ సినిమాలపై చేసిన కామెంట్స్ అవి. దయచేసి అందరికీ ఓ కార్లిటీ ఇచ్చానని, వచ్చిందని ఆశిస్తున్నా అని శ్రుతి హాసన్ పేర్కొంది.


Click it and Unblock the Notifications











