మంట పెడుతోన్న వకీల్ సాబ్ ట్రైలర్ .. శ్రుతీ హాసన్‌కు దారుణమైన పరాభవం
మామూలుగా స్టార్ హీరోల సినిమాలంటేనే హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అలాంటి నాలుగేళ్ల గ్యాప్ తరువాత వస్తోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కోసం ఎలాంటి మీటర్‌లో మేకర్స్ ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే అది హిందీలో వచ్చి, తమిళంలోనూ రీమేక్ అయిన సినిమా. పింక్ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. ఆ సినిమానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌గా రీమేక్ చేసేశాడు.

కథ అదే..
అన్యాయానికి గురైన అమ్మాయిల తరుపున పోరాడే న్యాయవాది పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. అయితే పింక్ సినిమాలో అమితాబ్ క్యారెక్టర్‌లో అంతటి హీరోయిజం ఉండదు. పింక్ చిత్రంలో అమితాబ్‌ది గెస్ట్ రోల్‌లా ఉంటుంది. అక్కడ తాప్సీ ఇతర తారాగణంతో సినిమాను నడిపించారు. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని పెంచేశారు.

కథలో హీరోయిన్..
పింక్ సినిమాలో హీరోయిన్ అంటూ ఎవ్వరూ ఉండరు. అలాగే తమిళంలో వచ్చిన నేర్కొండ పార్వై చిత్రంలో అజిత్ సరసన విద్యా బాలన్ నటించింది. అక్కడ కమర్షియల్ అంశాలను జోడించారు. ఇక తెలుగులో చాలానే మార్పులు చేర్పులు చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు కథ రూపు రేఖలే మారాయని తెలుస్తోంది.

హీరోయిన్ ప్రాముఖ్యత..
అలాంటి రీమేక్ సినిమా, అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో అంటే హీరోయిన్ ప్రాముఖ్యత ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్‌కు అసలు ప్రాధాన్యత లేదని మేకర్స్ క్లియర్‌గా చెప్పేసినట్టు తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన ట్రైలర్‌లో ఒక్క షాట్‌లో కూడా శ్రుతీ హాసన్ కనిపించలేదు.

దుమ్ములేపుతున్న ట్రైలర్..
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. కేవలం ట్రైలర్‌కే ఇలా రికార్డులు బద్దలవతున్నాయి. లైకులు, వ్యూస్ విషయంలో యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగుతోంది. అయితే ఇప్పుడు మాత్రం అందరూ ఒకే విషయంపై చర్చించుకుంటున్నారు.

శ్రుతీ హాసన్‌కు పరాభవం
వకీల్ సాబ్ ట్రైలర్ మొత్తంలో శ్రుతీ హాసన్ ఒక్క సెకన్ కూడా కనిపించలేదు. అంజలి, అనన్య నాగళ్ల, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ ఇలా అందరూ కనిపించారు. కానీ ఒక్క షాట్‌లో కూడా హీరోయిన్ కనిపించలేదు. అంటే ఆమె ప్రాముఖ్యత ఎంత ఉందో చూడండి అంటూ నెటిజన్లు సైటైర్లు వేస్తున్నారు. రేపు సినిమా విడుదలయ్యాక కూడా శ్రుతీ హాసన్ పరిస్థితి ఇంతేనేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఇది కచ్చితంగా శ్రుతీ హాసన్‌కు పరాభవం వంటిదేనని అంటున్నారు.


Click it and Unblock the Notifications











