పవన్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్: ఆమె కారణంగానే ‘వకీల్ సాబ్’ హిట్.. మైనస్ అనుకున్నదే ప్లస్ అయింది

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ పేరు మారుమ్రోగిపోతోన్న విషయం తెలిసిందే. దీనికి కారణం దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన నటించిన 'వకీల్ సాబ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడమే అన్న అంశాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా అటు రెండు రాష్ట్రాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో సైతం ఈ మూవీ ట్రెండ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' మూవీ హిట్ వెనుక ఓ సెంటిమెంట్ ఉందని తాజాగా ఒక వార్త ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే...

వకీల్‌ సాబ్‌గా మారి రీఎంట్రీ ఇచ్చిన పవన్

వకీల్‌ సాబ్‌గా మారి రీఎంట్రీ ఇచ్చిన పవన్

సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఆడవాళ్ల సమస్యలపై తీసిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ రూపొందించాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. ఇది 'పింక్'కు రీమేక్‌గా వచ్చింది.

భారీ స్పందన... ఐదు రోజుల్లోనే అదిరేలా

భారీ స్పందన... ఐదు రోజుల్లోనే అదిరేలా

ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన వచ్చింది. తద్వారా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పాటు భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం కలెక్షన్లను కూడా అదే రీతిలో దక్కించుకుంది. ఇక, ఐదు రోజుల్లోనే దాదాపు రూ. 70 కోట్లు వసూలు చేసింది.

ప్రభుత్వం నుంచి దెబ్బలు ఎదురైనా కూడా

ప్రభుత్వం నుంచి దెబ్బలు ఎదురైనా కూడా

'వకీల్ సాబ్' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ సినిమా బెనిఫిట్, స్పెషల్ షోలు రద్దు చేసిన జగన్ సర్కారు.. ఆ వెంటనే టికెట్ రేట్లను తగ్గించాలని కొత్త జీవోను తీసుకొచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడిపోయింది. ఈ ఇష్యూ కోర్టు వరకూ వెళ్లడంతో పెద్ద వివాదంగా మారిపోయింది.

‘వకీల్ సాబ్'లో అదొక్కటే మైనస్ అని టాక్

‘వకీల్ సాబ్'లో అదొక్కటే మైనస్ అని టాక్

చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ నటించిన చిత్రం కావడంతో 'వకీల్ సాబ్'కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అందులోనూ ఆడవాళ్ల గురించి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. రివ్యూలు అన్నీ ఈ చిత్రానికి పాజిటివ్‌గానే వచ్చాయి. కానీ, అందరి నోటా ఇందులో హీరోయిన్ ట్రాక్ పెట్టడం మైనస్ అన్న టాక్ గట్టిగా వినిపించింది.

ఆమె కారణంగానే ‘వకీల్ సాబ్' హిట్ అంటూ

ఆమె కారణంగానే ‘వకీల్ సాబ్' హిట్ అంటూ

నిజానికి 'వకీల్ సాబ్' సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ కనిపించేది చాలా తక్కువ సమయమే. ఇక్కడి ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా ఆమె పాత్రను క్రియేట్ చేశాడు దర్శకుడు. ఇప్పుడిదే సినిమాకు మైనస్ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రమే ఆమె వల్లే పవన్ కల్యాణ్ సినిమా హిట్ అయిందంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓ సరికొత్త అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
పవన్‌ కల్యాణ్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్

పవన్‌ కల్యాణ్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్

ఫ్లాపులతో ఇబ్బందులు పడే హీరోలకు శృతి హాసన్ పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ ఇస్తుందన్న టాక్ ఉంది. గతంలో రవితేజ వరుస పరాజయాలతో ఇబ్బందులు పడగా.. అప్పుడు 'బలుపు'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక, ఈ మధ్య 'క్రాక్'తో మరోసారి అలా గట్టేక్కాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతి హాసనే హీరోయిన్. అలాగే, పవన్‌కు కూడా గతంలో 'గబ్బర్ సింగ్'తో ఇప్పుడు 'వకీల్ సాబ్'తో బ్రేకిచ్చిందట ఈ అమ్మడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X