twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ నో చెబితే, ప్రభాస్ బాలేదన్నాడు.. సింహాద్రి రికార్డుకు 17 ఏళ్ళు.. కలెక్షన్స్ ఎంతంటే?

    |

    కొన్ని సినిమాలు సాధించిన విజయాలు ఎంతో మందికి ఉహీంచని ఆలోచనను కలిగిస్థాయి. అలాగే మరికొందరికి జ్ఞానోదయం కలిగిస్తే మరికొందరి జీవితాలనే మార్చేస్తాయి మరికొన్ని సినిమాలు. అలాంటి సినిమాల్లో సింహాద్రి ఒకటి. 2003లో విడుదలైన ఆ సినిమాకు నేటితో 17 ఏళ్ళు నిండాయి. అయితే ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలపై ఒక లుక్కేద్దాం..

     ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది..

    ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది..

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి సినిమా వచ్చి అప్పుడే 17 ఏళ్లవుతోంది అంటే నమ్మలేకపోతున్నాం అంటూ నందమూరి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడు చూసినా కూడా కొత్తగానే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం, డ్యాన్స్.. జక్కన్న మేకింగ్.. కీరవాణి మ్యూజిక్ వంటి అంశాలు సినిమాలో సరికొత్త ఫీలింగ్ కలిగిస్తాయి.

    రాజమౌళి చేయలేడన్నారు..

    రాజమౌళి చేయలేడన్నారు..

    అయితే ఈ సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి అప్పట్లో చాలానే కష్టపడ్డాడు. మొదట ఈ సినిమా కథను బాలకృష్ణ కోసం రాశారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. బాలకృష్ణ ఎందువల్లనో గాని కుదరదని చెప్పేశాడు. ఆ తరువాత అప్పట్లో లీడ్ లో ఉన్న కొంతమంది స్టార్ హీరోలను కూడా రాజమౌళి కలిశాడు. స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి సింపుల్ సినిమాను తీసిన దర్శకుడు ఇంత పెద్ద కథను డీల్ చేయలేడని మరికొందరు రిజెక్ట్ చేశారు.

     ప్రభాస్ బాలేదన్నాడు..

    ప్రభాస్ బాలేదన్నాడు..

    ఇక ఆ తరువాత వర్షం సినిమాతో అప్పుడే స్టార్ గా క్లిక్కయిన ప్రభాస్ వద్దకు వెళ్ళడంతో కథ నచ్చకపోవడంతో కుదరదు అనేశాడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను ప్రభాస్ అంతగా ఇష్టపడలేదు. అందుకే ఆ కథపై కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని పలు సందర్బల్లో కూడా చెప్పాడు. కానీ తారక్ చేయడంతో ఆశ్చర్యపోయినట్లు బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆ విషయం బయటపెట్టాడు.

     ఎన్టీఆర్ ఒక్కడే..

    ఎన్టీఆర్ ఒక్కడే..

    స్టూడెంట్ నెంబర్ సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత ఆది సినిమాతో తన రేంజ్ ని మరింత పెంచుకున్నాడు. ఇక రాజమౌళి చాలా మందిని సంప్రదించి మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లగా సందేహం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే రాజమౌళిని చాలా గట్టిగా నమ్మాడు.

    బాక్సాఫీస్ హిట్..

    బాక్సాఫీస్ హిట్..

    ఇక విడుదలైన మొదటి రోజు నుంచే సింహాద్రి సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఉహీంచని విధంగా చాలా ఏరియాల్లో 200రోజుల వరకు థియేటర్స్ లో సందడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ట్రెండ్ సెట్ చేశాయి. అలాగే కథను రిజెక్ట్ చేసిన వారికి షాకిచ్చింది. కేవలం ఎనిమిదిన్నర కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఆ సినిమా 25కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని దాదాపు 14కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించిందని సమాచారం.

    English summary
    The success of some films has left many people with an unheard of idea. And some more enlightenment will change the lives of some more movies. Simhadri is one of such films. Released in 2003, the film is 17 years completed. But let's take a look at some of the interesting aspects of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X