నెట్టింట వైరల్ అవుతున్న గీతామాధురి సీమంతం వీడియో.. యాంకర్స్ హాజరై

టాలీవుడ్ టాప్ సింగర్ గీతామాధురి సీమంతం వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. నిజానికి గీతామాధురి గర్భవతి అనే విషయాన్ని ఆమె గానీ, ఆమె భర్త గానీ వెల్లడించలేదు. కాకపోతే ఎలాగోలా ఆమె సీమంతానికి సంబందించి కొన్ని పిక్స్ బయటకు రావడంతో గీతామాధురి గర్భవతి అని అందరికీ తెలిసిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె సీమంతానికి సంబందించిన వీడియో కూడా బయటకు వచ్చేసింది.

కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా గీతామాధురి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. హిందూ ఆచార సంప్రదాయాలతో సాగిన ఈ వేడుకలో భర్త నందుతో పాటు ఆమె బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. తాజాగా యూట్యూబ్‌లో గీతామాధురి ఈ సీమంతం వీడియో దర్శనమీయడంతో ఆమె అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఈ వేడుకను చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగర్స్ అంజనా సౌమ్య, మాళవిక, యాంకర్ శ్యామల కనిపించారు. గీతామాధురి, ఆమె భర్త ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూ ట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. గీతా మాధురి దంపతులకు పండంటి బిడ్డ జన్మించాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.

Singer Geetha Madhuri Welcomes her First Baby Soon

తెలుగులో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురి.. యాక్టర్ నందును ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం ఫిబ్రవరి 9, 2014లో జరిగింది. అంటే దాదాపు పెళ్లయిన ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఈ దంపతులు పిల్లలను ప్లాన్ చేసుకున్నట్లు అర్థమవుతోంది. గీతామాధురి పదేళ్ల కెరీర్లో ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 550 పాటలు పాడింది. పలుచిత్రాల్లో ఆమె పాడిన పాటలకు అవార్డులు కూడా దక్కాయి. ఇక గతేడాది 'బిగ్ బాస్ 2' రియాల్టీ షో ద్వారా తెరపై ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించింది గీతా మాధురి.

More from Filmibeat

Read more about: geetha madhuri pregnant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X