Lata Mangeshkar Net worth: పాటల ద్వారానే ఏడాదికి అన్ని కోట్లు.. మొత్తం ఆస్తి విలువ ఎంతంటే!
సుదీర్ఘ కాలం పాటు సినీ రంగంలో విశేషమైన సేవలు అందించిన దిగ్గజ గాయకురాలు.. సినీ వినీలాకాశంలోని ధృవతార గానకోకిల లతా మంగేష్కర్ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె.. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం ఉదయం ఆమె పరిస్థితి క్షిణించింది. దీంతో ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాసను విడిచారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణంతో యావత్ భారతావని మొత్తం దుఖ: సాగరంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో లతా మంగేష్కర్ నికర ఆస్తుల విలువ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం పదండి!

లతా మంగేష్కర్ మరణానికి కారణం
కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన లతా మంగేష్కర్.. అప్పటి నుంచి చికిత్సను పొందుతూనే వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలే దాని నుంచి కోలుకున్నారు. అయితే, ఊపరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉండడంతో పూర్తిగా కోలుకునేంత వరకూ ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే మరణించారు.

అభిమానులు, సెలెబ్రిటీలు నివాళి
దిగ్గజ గాయకురాలు గాన కోకిల లతా మంగేష్కర్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆమె మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. దీంతో లతా మంగేష్కర్ పేరు ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

ఎన్నో భాషల్లో అన్ని వేల పాటలు
ఐదేళ్ల వయసులోనే గాయనిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్.. అతి తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకున్నారు. ఇలా సుదీర్ఘమైన ప్రయాణంలో దాదాపు 20 భాషల్లో సుమారు యాభై వేలకు పైగా పాటలను ఆలపించారు. అందులో ఎక్కువగా హిందీ, మరాఠీ భాషల్లోనే స్వరాన్ని అందించి శ్రోతలను విశేషంగా అలరించారు.

లతా మంగేష్కర్ ఏడాది ఆదాయం
సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో వేల పాటలను పాడిన గాన కోకిల లతా మంగేష్కర్ కెరీర్ పరంగానే భారీగా ధనాన్ని అర్జించారు. అప్పట్లోనే ఆమె ఎక్కువ ఛార్జ్ చేసిన సింగర్‌గా రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు, ఆమె నెలకు రూ. 40 నుంచి రూ. 50 లక్షలు సంపాదించేవారని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలా ఏడాదికి సుమారు రూ. 5 - 6 కోట్లు సంపాదించే వారని లెక్కలు చెబుతున్నాయి.

లతా మంగేష్కర్ నికర విలువ ఇలా
దాదాపు ఎనభై ఏళ్ల పాటు గాయనిగా తన ప్రయాణాన్ని కొనసాగించిన లతా మంగేష్కర్.. తన కుటుంబాన్ని పోషించే బాధ్యతను చిన్నప్పటి నుంచే తీసుకున్నారు. అదే చనిపోయే ముందు వరకూ కొనసాగించారు. ఈ ప్రయాణంలో తన గాత్రం ద్వారా ఎంతో సంపాదించారు. తాజా లెక్కల ప్రకారం.. 2022 వరకూ సుమారు రూ. 115 కోట్లు నికర విలువను కలిగి ఉన్నారని తెలుస్తోంది.

ఆ ఆస్తులతో కలిపి 200 కోట్లకు పైగా
మరణించే ముందు వరకూ లతా మంగేష్కర్ లగ్జరీ లైఫ్‌ను అనుభవించారు. ఆమెకు ముంబై సహా కొన్ని నగరాల్లో విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో విలువైన భూములు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇలా మొత్తం మీద ఆమెకు రూ. 200 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. ఇదంతా ఆమె కష్టార్జితమేనన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











