twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పదహారేళ్లప్పుడు వచ్చాను..దానికి కారణం మీరే.. ఎస్పీబీని తలుచుకుంటూ స్మిత ఎమోషనల్

    |

    ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం మరణం తీరని లోటు. కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాదు యావత్ భారత సినీ సంగీత పరిశ్రమలో ఆయన లేని లోటు పూడ్చలేనింది. కరోనాతో పోరాడి జయించినా మిగతా అనారోగ్య సమస్యలు, ఊరితిత్తుల ఇన్ ఫెక్షన్‌తో వంటి వాటితో పోరాడి నిన్న (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం తుది శ్వాస విడాచారు. ఎస్పీబీ మరణంతో యావత్ భారతదేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఈ మేరకు ఆయనతో అనుబంధం ఉన్న వ్యక్తులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

     కదిలిన చిత్రసీమ..

    కదిలిన చిత్రసీమ..

    ఎస్పీబీ ఇక లేరు అన్న వార్తతో యావత్ భారత సినీ పరిశ్రమ ఆందోళన చెందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళి, హిందీ చిత్ర పరిశ్రమలు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ స్పందించారు. ఇక ముఖ్యంగా ఆయన శిష్యులు, పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా ఎదిగిన వారంతా కన్నీరు మున్నీరయ్యారు.

    పాడుతా తీయగా ఓ సన్సేషన్..

    పాడుతా తీయగా ఓ సన్సేషన్..

    తెలుగులో పాడుతా తీయగా అనే ఓ కార్యక్రమం ఓ సన్సేషన్. దశాబ్దానికిపైగా ఈ ప్రోగ్రాంను తన భుజాలపై మోసుకుంటూ వచ్చారు బాలు. ఈ వేదిక ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది యువ గాయనీగాయకులను అందించారు. ఇప్పుడున్న సింగర్లలో దాదాపు అందరూ అక్కడి నుంచి వచ్చిన వారే.

     స్మిత కూడా..

    స్మిత కూడా..

    పాప్ సింగర్ స్మితను పరిచయం చేసింది కూడా ఈ ప్రోగ్రామే. నిన్న పాడుతా తీయగాలోని స్మిత వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. స్మితకు, ఈ ప్రోగ్రాంకు, బాలుకు విడదీయని అనుబంధం ఉంది. తాజాగా స్మిత ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది.

    అలా గుర్తుపట్టేశారట..

    అలా గుర్తుపట్టేశారట..

    మొదట్లో స్మిత పాడుతూ ఉంటే నటివి అవుతావని బాలు అన్నారట. కానీ అలాంటిదేమీ లేదని, కేవలం తానో గాయకురాలిని అని మాత్రమే స్మిత పేర్కొంది. కానీ పాప్ సింగర్‌గా దేశాన్ని ఊపేయడమే కాదు నటిగానూ అద్భుతంగా నటించి తన ప్రతిభను చాటుకుంది.

    Recommended Video

    #SPBalasubramaniam : Sekhar Kammmula,Boyapati Srinu,Raghu Kunche Expresses Their Condolences For SPB

    పదహారేళ్ల వయసులో..


    ఎస్పీబీ ఉన్న అనుబంధం చెబుతూ ఈ వీడియోను షేర్ చేసిన స్మిత ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇక మీరు లేరనే ఫీలింగ్ నన్ను ఎంతో కలిచివేస్తోంది.. మూగబోయేలా చేస్తోంది. మీరు నాకోసం చేసిన వాటిని ఎన్నటికీ మరిచిపోలేను. జీవితాంతం పదిలంగా దాచుకుంటాను. నేను పాడటానికి వచ్చినప్పుడు నా వయసు పదహారేళ్లు.. అప్పుడు నాకు నాముందున్న ప్రపంచం గురించి ఏమీ తెలీదు.. నా ప్రయాణం ప్రారంభం కావడానికి కారణం మీరే. మిస్ యూ బాలు గారు అంటూ ఎమోషనల్ అయింది.

    English summary
    Singer Smita Recalls Experience WIth SP Balasubrahmanyam, The feeling tht I can’t c u again hit me late & I feel numb. I cherish every moment spent & can’t thank u enough for everything you’ve done for me. I was 16 & knew nothing abt the world ahead of me. U were the reason for my journey to begin & I will be grateful Folded hands Miss u Balugaru
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X