twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా జీవితంలో మధురమైన అనుభవం... బాలుపై సునీత ఎమోషనల్ పోస్ట్

    |

    సినీ సంగీత ప్రపంచంలో 2020 తీరని లోటును మిగిల్చింది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్గస్థులయ్యారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నా కూడా ఇతర సమస్యలు వెంటాడటంతో సెప్టెంబర్ 25న తుది శ్వాస విడిచారు. చెన్నైలోని దాదాపు నెల రోజులకు పైగా చికిత్స తీసుకుంటూ చివరగా ప్రాణాలు వదిలేశారు. అలా భారత సంగీత ప్రపంచంలో పూడ్చలేని శూన్యాన్ని మిగిల్చారు. ఎస్పీబీని తలుచుకోని రోజంటూ ఉండదు. ఏ పాట విన్నా సరే అందులో ఎస్పీబీ కనిపిస్తారు.. వినిపిస్తారు. అలా సింగర్ సునీత తాజాగా ఎస్పీబీని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది.

    నా ఆత్మ బంధువు. నా మావయ్య

    నా ఆత్మ బంధువు. నా మావయ్య

    నా ఛిద్రమైన జీవితం లో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే అంటూ ఎస్పీబీ మృతిపై సునీత భావోద్వేగానికి లోనైంది. తాజాగా మరోసారి సునీత ఎస్పీబీని తలుచుకుంది.

    బాపు జయంతి..

    బాపు జయంతి..

    తెలుగుదనానికి, తెలుగు అందానికి ఓ నిర్వచనం ఇచ్చిన వ్యక్తిగా బాపును ఎప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుంటారు సినీ ప్రేమికులు. ఇప్పటికీ అమ్మాయిని వర్ణించాలంటే బాపు బొమ్మలా ఉందనే అంటారు. అలా బాపు తెలుగు వారిపై చెరగని ముద్ర వేశారు. నిన్న (డిసెంబర్ 15) బాపు జయంతి సందర్భంగా సునీత ఎస్పీబీపై ఎమోషనల్ అయింది.

    మధురమైన అనుభవం..

    మధురమైన అనుభవం..

    బాపు గారు పుట్టిన రోజు.. బాలు గారు గాయకుడు గా పుట్టినరోజు.. మనందరికి పండుగ రోజు. ధనుర్మాసం సందర్భంగా బాపు గారి బొమ్మలతో ముళ్ళపూడి వెంకట రమణ గారు రచించిన "మేలుపలుకుల మేలుకొలుపు" లో బాలు గారి సంగీత దర్శకత్వంలో నేను పాడిన పాట నా జీవితం లో అత్యంత ప్రత్యేకమైనది. బాలు గారు దగ్గరుండి పాడించటం నా జీవితం లో మధురమైన అనుభవం. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. తిరిగొస్తే బావుండు.. అంటూ సునీత ఎమోషనల్ అయింది.

    Recommended Video

    #SingerSunithaEngagement: వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత పెళ్లి | Singer Sunitha Second Marriage
    వార్తల్లో వైరల్..

    వార్తల్లో వైరల్..

    సునీత ఈ మధ్య వార్తల్లో వైరల్ అవుతోంది. రెండో పెళ్లికి సంబంధించిన వార్తలతో సునీత సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతోంది. రెండో పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం ఫోటోలు బాగానే వైరల్ అయింది. అయితే డిసెంబర్‌లో అనుకున్న పెళ్లి కాస్తా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సునీత పెళ్లి చేసుకోబోతోన్నట్టు తెలుస్తోంది.

    English summary
    Singer Sunitha Emotional On SP Balu About Bapu Birth Anniversary.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X