భర్తతో కలిసి బీచ్‌లో సింగర్ సునీత ఎంజాయ్: తొలిసారి అలా కనిపించడంతో షాకైపోతున్న జనాలు
అద్భుతమైన గాత్రంతో కొన్ని వేల పాటలు ఆలపించి.. దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు వారి మదిని దోచుకుంటోన్న సింగర్ సునీత. చిన్న వయసులోనే ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె.. అతి తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపును అందుకున్నారు. తద్వారా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సత్తా చాటారు. ఇక, ఇటీవలే రెండో వివాహం చేసుకున్న ఈ టాప్ సింగర్.. తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సునీత తన భర్తతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేశారు. ఆ వివరాలు మీకోసం!
మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

సుదీర్ఘ ప్రస్థానం... ఎన్నో మైలురాళ్లు సొంతం
సంగీతం మీద ఉన్న ఆసక్తితో చిన్న వయసులోనే దానికి సంబంధించిన శిక్షణను తీసుకున్నారు సునీత. 15 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మరపురాని గీతాలను ఆలపించి ఔరా అనిపించారు. తద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అంతేకాదు, ఎన్నో అవార్డులు, పురస్కారాలను తన ఖాతాలో వేసుకున్నారామె.

చిన్న వయసులోనే పెళ్లి... భర్తతో విడాకులు
19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సింగర్ సునీత.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ తర్వాత మనస్ఫర్థల కారణంతో ఈ జంట న్యాయ పరంగా విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సినిమాల్లో పాటలు పాడుతూ.. డబ్బింగ్ చెబుతూ తన ఇద్దరు పిల్లలను పోషించారు.

రహస్యంగా నిశ్చితార్థం... పెళ్లి సంబరంగానే
సునీత రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూ ఉండేవి. కానీ వాటిని ఆమె పలుమార్లు కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో ఆమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం సంబరంగా వివాహం చేసుకున్నారు సింగర్ సునీత.

వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతూ
రామ్‌తో వివాహం జరిగిన తర్వాత సునీత చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. తరచూ ఏదో ఒక ప్రదేశానికి వెళుతూ ఆనందంగా గడుపుతున్నారు. అంతేకాదు, ఆ మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలోనూ వదులుతున్నారు. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్‌తో ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు.

భర్తతో కలిసి బీచ్‌లో సింగర్ సునీత ఎంజాయ్
వివాహం తర్వాత హనీమూన్‌కు ఎటు వెళ్తారు అని అప్పట్లో సునీతను అడగగా.. మాల్దీవులు అని టక్కున చెప్పేశారు. అందుకు అనుగుణంగానే తర్వాత తన భర్త రామ్‌తో కలిసి అక్కడ వాలిపోయారామె. సముద్రపు అలలపై నిర్మించిన రిసార్టుల్లో సేద తీరుతూ దిగిన ఫొటోలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరికొన్ని పిక్స్‌ను వదలారు.

తొలిసారి అలా కనిపించడంతో షాకైపోతున్నారు
మాల్దీవుల్లో భర్తతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను సునీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆమె అల్ట్రా స్టైలిష్ లుక్‌తో దర్శనమిస్తున్నారు. అలాగే, భర్తతో బోట్‌లో ప్రయాణించిన పిక్స్‌ను కూడా వదిలారు. వీటితో పాటు సముద్రపు అలల ముందు ఫోజులిస్తూ కొన్ని ఫొటోలను క్లిక్‌మనిపించారు. ఇవన్నీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











