అలాంటి ఫీలింగ్స్ ఉంటే ఆత్మహత్య చేసుకునేదాన్ని: సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు
సింగర్ సునీత.. ఈ పేరుతో తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా రెండు దశాబ్ధాలుగా సినీ ఇండస్ట్రీలో తన ప్రభావాన్ని చూపిస్తోందామె. సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి కొన్ని వేల పాటలను ఆలపించిన ఆమె.. ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఇలా కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక, ఈ మధ్య తన రెండో పెళ్లిపై ప్రకటన చేసిన సునీత... ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ వివరాలు మీకోసం!
Recommended Video

సుదీర్ఘ ప్రయాణం.. సూపర్ డూపర్ హిట్లు
సింగర్ అవాలన్న లక్ష్యంతో సునీత చిన్న వయసు నుంచే సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అందులో రాణించి కొన్ని పోటీల్లోనూ గెలుపొందారు. దీంతో 15 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయం అయ్యారామె. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మరపురాని గీతాలను ఆలపించి.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. తద్వారా ఎన్నో అవార్డులు, పురస్కారాలను అందుకున్నారు.

టీనేజ్‌లోనే వివాహం... కెరీర్‌ను ఆపలేదు
టీనేజ్‌లోనే వరుసగా సినిమాల్లో పాటలు పాడే అవకాశాలను అందుకున్నారు సునీత. అలాగే, చాలా మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఇలా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకు వివాహం నిశ్చయమైంది. 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంటకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇవేమీ ఆమె కెరీర్‌ను ఆపలేదు.

భాగస్వామితో మనస్ఫర్థలు... విడాకులు
చాలా ఏళ్ల పాటు సజావుగా సాగిన వైవాహిక జీవితానికి కొన్నేళ్ల క్రితం పుల్‌స్టాప్ పెట్టారు సునీత. వ్యక్తిగత కారణాలతో న్యాయబద్ధంగా విడాకులు తీసుకుని భర్తకు దూరమైపోయారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సినిమాల్లో పాటలు పాడుతూ.. డబ్బింగ్ చెబుతూ తన ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

రెండో పెళ్లికి రెడీ.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్
సుదీర్ఘమైన కెరీర్‌లో సునీత ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. అలాగే, రెండో పెళ్లి గురించి తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో గాయని సునీత వివాహం సెట్ అయింది. కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా జరిగినప్పటికీ.. అది లీక్ అయింది.

సునీత పెళ్లికి అడ్డంకి.. రెండు రోజుల్లో పెళ్లి
సునీత - రామ్ పెళ్లి డిసెంబర్ 26న గానీ 27న గానీ జరగబోతుందని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ, జాతకాల ప్రకారం మంచి ముహూర్తం దొరకలేదట. ఈ నేపథ్యంలోనే జనవరి 9 వీళ్ల జాతకాలకు సరిపడే జాతకం ఉండడంతో.. ఆరోజే పెళ్లి జరపాలని నిశ్చియించారు. ఈ విషయాన్ని ఇటీవల తిరుమల వెళ్లినప్పుడు సునీతనే స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఫీలింగ్స్ ఉంటే ఆత్మహత్య చేసుకునేదాన్ని
కొద్ది రోజుల క్రితం ఓ యూట్యూబ్ చానెల్‌కు సునీత ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సింగర్ ఉషతో వివాదం గురించి మాట్లాడుతూ.. 'నాకు ఎవరి మీదా జెలసీ ఉండదు. ఒకవేళ అలాంటి ఫీలింగ్సే నాకు ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చనిపోయేదాన్ని. ఏ వివాదాన్నీ పట్టించుకోను కాబట్టే ఇలా ఉన్నా' అంటూ చెప్పారు. ఇప్పుడు ఆమె పెళ్లి కారణంగా ఈ వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











