Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పెళ్లి తరువాత ఎంత సంతోషంగా ఉందో.. భర్త గుండెపై వాలిన సునీత.. పిక్ వైరల్
ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. జీవితంలో ఓ తోడు ఉండాలి అంటే పెద్ద వాళ్లు చెప్పే మాటలు తీసిపారేసేవి ఏమీ కాదు. ఎవరికైనా ఏ వయసు వారికైనా సరే ఓ తోడు ఉంటే కలిగే సంతోషం, ఆనందం వేరుగా ఉంటాయి. సింగర్ సునీత ఇప్పుడు తన జీవితంలో కొత్త దశను ఆరంభించింది. రామ్ వీరపనేనితో వివాహాం తరువాత సునీత ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయం ఆమె తన పోస్ట్‌లతో చెప్పకనే చెప్పేస్తోంది.
ఎప్పటి నుంచో స్నేహం..
సునీత మొదటి వివాహాం, విడాకుల సంగతి అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లూ పిల్లలను పెంచడం, పెద్ద చేయడమే తన బాధ్యత అనుకుంది. కానీ పిల్లలు, కుటుంబ సభ్యుల ఇష్టం మేరకు మీడియా అధినేతి రామ్ వీరపనేనిని వివాహాం చేసుకుంది. వారి మధ్య ఎప్పటి నుంచో స్నేహబంధం ఉండగా.. అది చివరకు మూడు ముళ్ల బంధంగా మారింది.
సునీత రెండో వివాహాంపై..
సునీత రెండో వివాహాంపై సోషల్ మీడియాలో ఎంత స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఎక్కువ భాగం సునీత పెళ్లిని సమర్ధించారు. కానీ కొంత మంది మాత్రం ఆమె పెళ్లిపై నెగెటివ్‌గా కామెంట్ చేశారు. కానీ వాటిని సునీత గానీ, రామ్ గానీ పట్టించుకున్నట్టు లేదు.
వాటికి సమయం లేదు..
ప్రేమించడానికి, ఆనందంగా ఉంటానికి ఓ సమయం అంటూ ఉండదు.. ఎప్పుడైనా ఆ ఫీలింగ్స్ కలగవచ్చు అనే ఉద్దేశ్యంలో సునీత షేర్ చేసిన ఫోటోలు, చెప్పిన కొటేషన్లు తెగ వైరల్ అయ్యాయి.పెళ్లి తరువాత సునీత సోషల్ మీడియాలో కొత్తగా ప్రవర్తిస్తుంది. అప్పుడప్పుడు తన మనోభావాలను అలా చెబుతూ వస్తోంది.
స్నేహితుల ఫోటోలు..
పెళ్లి తరువాత సునీత తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని సెలెక్టెడ్ పోస్ట్‌లు చేస్తోంది. అందులో తన వివాహానంతర జీవితం పరోక్షంగా కనిపించేలా, తాను ఎంతో సంతోషంగా ఉన్నానో చెప్పేలా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా తన ఫ్రెండ్స్ అయిన సునీత, అనిత చౌదరిల ఫోటోలను షేర్ చేస్తూ.. ఎప్పటికీ స్నేహితులే అంటూ చెప్పుకొచ్చింది.
భర్త గుండెపై..
తాజాగా సునీత మరో ఫోటోను షేర్ చేసింది. తమ దాంపత్యం ఎంత అన్యోన్యంగా సాగుతోందో పరోక్షంగా చెబుతున్నట్టుగా ఉంది. అందులో సునీత తన భర్త గుండెపై వాలిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో చూడముచ్చటగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.
Recommended Video
పెళ్లి తరువాత ఇలా..
సునీత తన వివాహాం తరువాత స్పెషల్ పోస్ట్‌లను చేస్తూ వచ్చింది. వివాహానంతర జీవితం ఎలా ఉందో చూపిస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కాఫీ తాగుతున్న ఫోటోలను, ఇంటి గార్డెన్లో కూరగాయల మొక్కల్లో సందడి చేస్తోన్న ఫోటోలను షేర్ చేస్తూ కొటేషన్లను షేర్ చేసింది.