HBD Mrunal Thakur: ఆత్మహత్య నుంచి స్టార్ హీరోయిన్ వరకు.. ఇది 'సీతారామం' హీరోయిన్ స్టోరీ
సీతారామం మూవీ ఎంత పెద్ద క్లాసిక్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సీతగా అందరి అభిమానం సంపాదించుకుంది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్. అందమైన దృశ్యకావ్యంగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా సీతగా అలరించిన మృణాల్ ఠాకూర్ కు బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు నేడు (ఆగస్టు 1). 31వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ బ్యూటి కెరీర్ పై లుక్కేస్తే..
బర్త్-ఫ్యామిలీ: అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ మహారాష్ట్రాలోని ధూలేలో ఆగస్టు 1, 1992న జన్మించింది. మృణాల్ తండ్రి బ్యాంక్ ఎంప్లాయ్ కావడంతో తరచుగా వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యేది. ఇంటర్ పూర్తయ్యేలోపు మొత్తంగా 11 స్కూళ్లు మారింది. అందుకే ఆమెకు ఎక్కువ స్కూల్ ఫ్రెండ్స్ ఉండరని చెబుతుంటుంది. అయితే ఆమె ఎనిమిదో తరగతిలో ముంబైకి షిఫ్ట్ అయింది మృణాల్ ఫ్యామిలి.

గ్రామీణ ప్రాంతాల్లో: అప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న మృణాల్ కు ముంబై స్కూలులో ఇంగ్లీష్ సరిగా వచ్చేది కాదట. దీంతో మిగతా విద్యార్థులంతా తనను ఏడిపించేవారట. అప్పుడు పట్టుదలతో న్యూస్ పేపర్ చదివి, జస్టిస్ బైబర్ సాంగ్స్ వింటూ ఇంగ్లీష్ నేర్చుకునేదట. తర్వాత అనర్గళంగా మృణాల్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అంతా ఆశ్చర్యపోయారట.

ఆడిషన్ లేకుండా: అయితే ఒక సమయంలో ఒంటరితనం, నాన్నకు నచ్చిన చదువు చదవట్లేదని డిప్రెషన్ లోకి వెళ్లిన మృణాల్ ఠాకూర్ ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. రద్దీగా ఉండే లోకల్ ట్రైన్ లో డోర్ కు నిల్చున్నప్పుడు బయటకు దూకేయాలనిపించేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మృణాల్. ఇప్పుడు మాత్రం ఆడిషన్ లేకుండానే అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

సీరియళ్ల ద్వారా: ఒక షోలో మృణాల్ ఠాకూర్ ను ఓ డైరెక్టర్ ఆమెకు 2021లో 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ అవకాశం ఇచ్చారు. ఈ సీరియల్ ద్వారా బుల్లితెరపై తెరగేంట్రం చేసిన మృణాల్ అనేక సీరియల్స్, రియాలిటీ షోలలో అదరగొట్టింది. ఆమె నటించిన కుంకుమ్ భాగ్య అనే సీరియల్ ఇప్పటికీ టీవీలో వస్తూనే ఉంటుంది.

సినిమాలు: ఇక మరాఠీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మృణాల్ ఠాకూర్. 'విట్టి దండు' అనే చిత్రంలో హీరోయిన్ గా వెండితెరపై డెబ్యూ చేసింది. అనంతరం మరాఠీలోనే సురాజ్య అనే సినిమా చేసింది. తర్వాత నటనతో మెప్పించిన మృణాల్ సూపర్ 30, జెర్సీ, లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి మూవీస్ చేసి అలరిచింది.

కొత్త చిత్రాలు: ఇక తెలుగులో సీతా రామం సినిమాతో సూపర్ క్రేజ్ అందుకుంది మృణాల్ ఠాకూర్. ఇటీవల లస్ట్ స్టోరీస్ 2లో రొమాంటిక్ సీన్లతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ సూర్య 42వ సినిమా కంగువాలో నటిస్తున్నట్లు టాక్. నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమా చేస్తోంది ఈ బ్యూటి. ఇదే కాకుండా ఆంఖ్ మిచోలి మూవీతో కూడా బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











