Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేను మంచి దానిలా తయారవుతున్నా.. చీపురు పట్టి ఊడ్చిన సితార
సూపర్ మహేష్ బాబు ముద్దుల కూతరు సితారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సితార ముద్దు ముద్దు మాటలకు, క్యూట్ క్యూట్ స్టెప్పులకు ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. మహేష్ బాబు సినిమాలోని పాటలు పాడుతూ, కాళ్లు కదుపుతూ స్టెప్పులు వేసిన వీడియోలెన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సితారకు సంబంధించిన లెక్క లేనన్ని క్యూట్ వీడియోలు వైరల్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్న సితార ప్రస్తుతం అమ్మ నమ్రతకు సాయం చేసేంతగా ఎదిగింది.
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు ఫ్యామిలీ తెగ ఎంజాయ్ చేస్తోంది. వీడియో గేమ్‌లు ఆడుకుంటూ, చిన్నప్పటి ఆటలు ఆడుకుంటూ మహేష్ బాబు తన పిల్లలతో సరదాగా గడిపేస్తున్నాడు. ఈ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి నమ్రత నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. మెమోరీ థెరపీ అంటూ రోజుకో వీడియోను షేర్ చేస్తోంది. ఆ మధ్య సితారాను నవ్వించేందుకు మహేష్ బాబు చిన్న పిల్లాడిలా మారిపోయి బొమ్మతో విన్యాసాలు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.
అయితే ప్రస్తుతం సితార బుద్దిమంతురాలిగా తయారైంది. అమ్మకు సాయం చేసేంత పెద్దది అయింది. ఈ మేరకు చీపురు పట్టి ఇళ్లంతా ఊడ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ.. అమ్మకు సాయం చేద్దాం. ఇళ్లు శుభ్రపర్చడం అనేది సరదా పని. మా అమ్మకు సాయం చేయడానికి మంచి సమయం దొరికింది. మరో వారం మరో టాస్క్‌తో మీ ముందుకు వస్తా.. నాకు తెలిసి నేనింకా మంచి దానిలా మారుతున్నా.. మీ క్వారంటైన్ కథలు నాతో పంచుకోండ'ని సితార ఓ పోస్ట్ చేసింది.