గౌతమ్‌తో సితార పోటీ.. అన్నయ్యతో అలా అంటూ స్విమ్మింగ్.. పిక్స్ వైరల్
మహేష్ బాబు, ఆయన ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తన పిల్లలతో కలిసి చేసే అల్లరి గురించి నమ్రత గురించి ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక సితార కూడా సోషల్ మీడియాలో దుమ్ములేపుతూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ.. తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా సితార చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆ మధ్య అలా..
లాక్డౌన్ సమయంలో సితారా, గౌతమ్, మహేష్ బాబు చేసిన అల్లరికి సంబంధించిన ఫోటోలను నమత్ర షేర్ చేస్తూ వచ్చింది. అలా ఓ సారి ఓ వీడియోను షేర్ చేస్తూ స్విమ్మింగ్ గురించి చెప్పింది. మహేష్ బాబు తన పిల్లలతో కలిసి స్విమ్మింగ్ చేసిన వీడియో బాగానే వైరల్ అయింది.
ఎరుపు చీరలో కనువిందు చేసిన జాక్వలైన్ ఫెర్నాండేజ్..

స్విమ్మింగ్ అంటే ఇష్టం..
ఇక సితార, గౌతమ్‌లకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమని, మహేష్ బాబుతో పోటీ పడి మరీ స్విమ్ చేస్తున్నారని నమ్రత చెప్పుకొచ్చింది. అలా లాక్డౌన్ మొత్తాన్ని ఇంట్లో ఎంత సరదాగా గడిపాడు మహేష్ బాబు. సితార చిన్ననాటి మెమోరీస్ అన్నింటిని నమత్ర రీకాల్ చేసింది. వీడియోలు, ఫోటోలతో సందడి చేసింది.

తాజాగా అలా..
ఇక తాజాగా సితార తన అన్నయ్యతో కలిసి స్విమ్మింగ్ చేసింది. ఇద్దరూ కూడా బాగానే పోటీ పడ్డట్టున్నారు. అన్నయ్య మీద గెలవాలని సితార ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇలా లోతుల్లో ఉన్నామని స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సితార షేర్ చేసింది. మండిపోయే ఎండలకు ఇలా కూల్ కూల్‌గా సితార ఎంజాయ్ చేస్తోంది.

మొన్నటివరకు..
ఇక మొన్నటి వరకు మహేష్ బాబు ఫ్యామిలీ దుబాయ్‌లో ఎంజాయ్ చేసింది. దుబాయ్ ఎడారుల్లో రైడింగ్ చేస్తూ సితార రచ్చ చేసింది. మహేష్ బాబు ఈ మధ్యే హైద్రాబాద్‌కు తిరిగి వచ్చాడు. సర్కారు వారి పాట కోసం మహేష్ బాబు దుబాయ్‌లో ఓ లాంగ్ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











