ఎడారిలో ఎంజాయ్.. సితార ఘట్టమనేని పిక్స్ వైరల్
మహేష్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం ఎక్కడుందో అందరికీ తెలిసిందే. నమ్రత బర్త్ డే కోసం దుబాయ్ వెళ్లిన ఫ్యామిలీ.. సర్కారు వారి పాట షూటింగ్ కోసం అక్కడే ఉండిపోయింది. సర్కారు వారి పాట షెడ్యూల్‌ను దుబాయ్‌లో భారీ ఎత్తులో షూట్ చేస్తున్నారు. అదిరిపోయే యాక్షన్స్ సీక్వెన్స్‌లో మహేష్ బాబు దుమ్ములేపుతున్నాడట. కీర్తి సురేష్ కూడా ఇప్పుడు దుబాయ్‌లోనే ఉంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సీన్స్ కూడా జరుగుతున్నాయట.
అయితే షూటింగ్ మధ్యలో గ్యాప్ లేదా షూటింగ్‌లకు బ్రేక్ వస్తే మాత్రం మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఎంచక్కా బయటకు చెక్కేస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఎడారిలో ట్రిప్ వేశాడు. అక్కడ ఉండే వెరైటీ జీపులు, ఒంటెల మీద ప్రయాణాలు చేశారట. ఈ విషయాన్ని సితార తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ తెగ సంబరపడిపోయింది. ఇందులో మహేష్ బాబు కూడా బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తున్నాడు.

మొదటిసారిగా ఎడారిలో ఇలా ట్రిప్‌కు వెళ్లాను అని సితార చెప్పుకొచ్చింది. ఇందులో జీపులు, ఒంటెలు, భగ్గీల మీద ప్రయాణం చేశాను అని సితార తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం సితార షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ నెల చివరి వరకు మహేష్ బాబు ఫ్యామిలీ అక్కడే ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. సర్కారు వారి పాటను వచ్చే ఏడాది సంక్రాంతిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చిత్రయూనిట్ బాగా కష్టపడుతోన్నట్టుంది.


Click it and Unblock the Notifications











