వీకెండ్ స్పెషల్.. మహేష్ బాబు ఇంట్లో దర్శకుల ఫ్యామిలీల రచ్చ
మహేష్ బాబు తాను పని చేసే దర్శకులను ఫ్యామిలీలా కలిపేసుకుంటాడన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా మహేష్ ముద్దుల తనయ సితారతో అందరూ ఇట్టే కలిసిపోతుంటారు. అలా వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సితార చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆద్య సితార అంటూ ఓ యూట్యూబ్ చానెల్ కూడా పెట్టేశారు. అలా మహేష్ దర్శకులు, వారి ఫ్యామిలీ ఇట్టే కలిసిపోతుంటారు.

తాజాగా అలా..
తాజాగా సుకుమార్ ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. సుకుమార్ కూతురి సారీ ఫంక్షన్‌కు తన హీరోలందరూ వచ్చారు. అలా ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యామిలీలు ఆ ఈవెంట్‌లో సందడి చేశాయి. అయితే తాజాగా సుకుమార్ ఫ్యామిలీ మహేష్ ఇంట్లో సందడి చేసినట్టు కనిపిస్తోంది.

వీకెండ్ స్పెషల్..
వీకెండ్ సందర్భంగా సుకుమార్ ఫ్యామిలీ, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ మహేష్ ఇంట్లో సందడి చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు సితార పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ కూతురు సుకృతి బండ్రెడ్డి, వంశీ పైడిపల్లి కూతురు మాలిని పైడిపల్లితో తాను దిగిన ఫోటోలను సితార షేర్ చేసింది.

ఫుల్ హౌస్..
సుకృతి, మాలినిలతో సితార ఫోటోలు దిగింది. వీరి రాకతో హౌస్ ఫుల్ అయిందంటూ చెప్పుకొచ్చింది సితార. అయితే ఇదే పోస్ట్‌ను నమ్రత షేర్ చేస్తూ.. అవును ఇళ్లంతా నిండిపోయింది. అందరూ ఎదిగిపోయారు.. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసే టైం వచ్చింది.. శనివారం రచ్చ.. అమ్మాయిల సరదా అంటూ నమ్రత చెప్పుకొచ్చింది.

మీరెప్పుడైనా?
ఈ రోజంతా మాదే.. మాకు బోబా టీ అంటే చాలా ఇష్టం.. అది నోపోబోబో షాప్‌లో దొరుకుతుంది.. అదే మాకు ఇష్టమైన డ్రింక్.. మీరెప్పుడైనా ట్రై చేశారా? అంటూ సితారా తన స్నేహితులతో దిగిన ఫోటోలనుషేర్ చేసింది. మొత్తానికి ఈ ముగ్గురు కలిసి చేసిన రచ్చ ఇప్పుడు వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











