అర్దరాత్రి ఒంటి గంటకు.. ఎయిర్ పోర్ట్‌లో సితార కష్టాలు
మహేష్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం అమెరికాలో ఉందన్నసంగతి తెలిసిందే. ఓ వారం రోజుల వెకేషన్‌కు అక్కడికి వెళ్లాడు. మళ్లీ హైద్రాబాద్ తిరుగు ప్రయాణమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు నవంబర్ 17 అర్దరాత్రి ఒంటి గంటకు ఎయిర్ పోర్ట్‌లోకి వచ్చారని తెలుస్తోంది. అయితే హైద్రాబాద్ ఫ్లైట్ మాత్రం మూడు గంటలకు ఉందట. దీంతో రెండు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉన్నారు. ఈ మేరకు సితార తన కష్టాలను చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది.
నమత్ర శిరోద్కర్ సోదరి శిల్పా ఇంట్లో బర్త్ డే వేడుకలు జరిగాయి. వాటికోసమే మహేష్ బాబు ఫ్యామిలీ అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వేడుకల్లో మహేష్ బాబు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఇక అక్కడి వీధుల్లో, రెస్టారెంట్లలో మహేష్ బాబు ఫ్యామిలీ ఫుల్ సందడి చేసింది. ఇప్పుడు ఆ వెకేషన్‌కు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చింది. నిన్న అర్దరాత్రి దాటక విమానాశ్రయానికి చేరుకున్న మహేష్ బాబు ఫ్యామిలీ అక్కడే ఓ రెండు గంటలు ఎదురుచూసింది.

ఈ మేరకు సితార తన ఫోన్‌లో టైం చూపిస్తూ ఫ్లైట్ మూడు గంటలకు అంటా.. ఇంకా చాలా టైం ఉంది.. మేం హైద్రాబాద్‌కు రాబోతోన్నాం అని చెప్పుకొచ్చింది. అయితే ఈ రెండు గంటలు ఎలా గడుస్తాయో అంటూ పెదవి విరిచింది. సితారా ఇలా బాధపడుతూ ఉంటే.. నమ్రత మాత్రం మహేష్ బాబును చూస్తుంటే టైం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదని చెప్పింది. ఉదయం మూడు గంటలకు కూడా ఎవ్వరైనా ఇంత అందంగా కనిపిస్తారా? అని నమత్ర మహేష్ బాబు ఫోటోను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











