Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పిల్ల కాదు.. పిడుగు: అన్నయ్యను ఆటపట్టించిన సితార.. మురిసిన మహేష్ బాబు!
Recommended Video
మహేష్ బాబు, నమ్రత దంపతుల కూతురు సితారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అన్నయ్య గౌతమ్‌ను ఆటపట్టించినట్లు ఉన్న ఈ వీడియోలో సితార మాట్లాడే విధానం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
గౌతమ్, సితార... ఇద్దరిదీ భిన్నమైన వ్యక్తిత్వం. గౌతమ్‌తో పోలిస్తే సితార చాలా ఫాస్ట్ అని స్పష్టమవుతోంది. ఆమెలో ఆ చురుకుదనం చూసి మురిసిపోయిన మహేష్ బాబు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
|
మా అన్నయ్య ఫ్యామిలీ పిల్లాడు
‘‘హే గయ్స్.. నేను సితారను మాట్లాడుతున్నాను... మా అన్నయ్య గురించి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అతడు అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా ట్రిప్ వెళ్లడానికి ఇష్టపడడు. ఫ్యామిలీని అంటిపెట్టుకుని ఉండే పిల్లాడు' అంటూ సితార అమెరికన్ ఇంగ్లిష్ యాసలో అదరగొట్టింది.
పిల్ల కాదు.. పిడుగు
పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు సితార వయసులో గౌతమ్ కంటే చిన్నదే అయినా చిచ్చరపిడుగు లాంటి స్వభావం. పాప ఈ వయసులోనే ఇలా దడదడలాడిస్తుందంటే భవిష్యత్తులో ఏ స్థాయికి వెళుతుందో ఊహించడం కష్టమే.
సినిమాల వైపు వస్తుందా?
సినిమా కుటుంబంలో పుట్టిన సితార... భవిష్యత్తులో సినిమా రంగం వైపు వస్తుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే అందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తండ్రి మహేష్ బాబు పెద్ద సూపర్ స్టార్, తల్లి నమ్రత మాజీ మిస్ ఇండియా, నటి కావడం వల్ల ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది.
మహేష్ బాబు
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' చిత్రం చేస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.