twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిల్ల కాదు.. పిడుగు: అన్నయ్యను ఆటపట్టించిన సితార.. మురిసిన మహేష్ బాబు!

    |

    Recommended Video

    mahesh babu daughter sitara Video Goes Viral

    మహేష్ బాబు, నమ్రత దంపతుల కూతురు సితారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అన్నయ్య గౌతమ్‌ను ఆటపట్టించినట్లు ఉన్న ఈ వీడియోలో సితార మాట్లాడే విధానం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

    గౌతమ్, సితార... ఇద్దరిదీ భిన్నమైన వ్యక్తిత్వం. గౌతమ్‌తో పోలిస్తే సితార చాలా ఫాస్ట్ అని స్పష్టమవుతోంది. ఆమెలో ఆ చురుకుదనం చూసి మురిసిపోయిన మహేష్ బాబు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

    మా అన్నయ్య ఫ్యామిలీ పిల్లాడు

    ‘‘హే గయ్స్.. నేను సితారను మాట్లాడుతున్నాను... మా అన్నయ్య గురించి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అతడు అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా ట్రిప్ వెళ్లడానికి ఇష్టపడడు. ఫ్యామిలీని అంటిపెట్టుకుని ఉండే పిల్లాడు' అంటూ సితార అమెరికన్ ఇంగ్లిష్ యాసలో అదరగొట్టింది.

    పిల్ల కాదు.. పిడుగు

    పిల్ల కాదు.. పిడుగు

    పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు సితార వయసులో గౌతమ్ కంటే చిన్నదే అయినా చిచ్చరపిడుగు లాంటి స్వభావం. పాప ఈ వయసులోనే ఇలా దడదడలాడిస్తుందంటే భవిష్యత్తులో ఏ స్థాయికి వెళుతుందో ఊహించడం కష్టమే.

    సినిమాల వైపు వస్తుందా?

    సినిమాల వైపు వస్తుందా?

    సినిమా కుటుంబంలో పుట్టిన సితార... భవిష్యత్తులో సినిమా రంగం వైపు వస్తుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే అందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తండ్రి మహేష్ బాబు పెద్ద సూపర్ స్టార్, తల్లి నమ్రత మాజీ మిస్ ఇండియా, నటి కావడం వల్ల ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది.

    మహేష్ బాబు

    మహేష్ బాబు

    మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' చిత్రం చేస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Mahesh Babu and Namrata’s daughter Sitara has made a cute video in which she explains why her brother Gautham is a family guy. Mahesh Babu has shared the video on his Instagram and captioned it, “Her brother… the family guy #sitapapaatherbest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X