Father's day: క్లింకారతో రాంచరణ్ చరణ్ అలా.. సితారతో మహేష్ బాబు ఇలా.. ఫోటోలు వైరల్!
ఈ లోకంలో ఏ పిల్లలకు అయినా తండ్రే మొదటి హీరో. ముఖ్యంగా కూతుర్లకు తండ్రితో ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రతి తండ్రి.. కూతురు చేతికి బొమ్మనే. ఎవరు కన్నెత్తి కూడా చూడలేని తండ్రి కోపాన్ని.. కూతురు ఇట్టే తీర్చేయగలదు. స్టార్ హీరోలు సైతం అందుకు అతీతమేమి కాదు. నేడు ఫాదర్స్ డే. ఈరోజు ఇద్దరు స్టార్ హీరోలు తమ కూతుర్లతో కలిసి ఎలాంటి ఫోటోలను షేర్ చేశారు. అసలు ఆ స్టార్ హీరోలు ఎవరు.. ? చూద్దాం రండి.
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలిసినవి రెండే రెండు. ఒకటి సినిమా.. రెండు కుటుంబం. సినిమాను కొద్దిగా ఆలస్యం అయినా చేస్తాడేమో కానీ, కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి ఎప్పుడు ఆలస్యం చేయడు. ఇక మహేష్ గారాలపట్టి సితార గురించి అసలు పరిచయమే చేయాల్సిన అవసరం లేదు.

ఆమె పుట్టినప్పటి నుంచే స్టార్ గా మారింది. ఈ తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న బాండింగ్ చాలా రేర్. పుట్టినప్పటినుంచి సీతూ పాపతోనే మహేష్ ఆటలన్నీ. ఎక్కడకు వెళ్లినా సితార పక్కన ఉండాల్సిందే. ముద్దు ముద్దు మాటలతో సితార చేసే అల్లరిని మహేష్ అలా చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు సీతారాకు 11 ఏళ్లు వచ్చినా కూడా అలానే ఆమె అల్లరిని చూస్తూ ఉంటాడు.
సితారకు తండ్రి అంటే ప్రాణం. నాన్నకూచి. ఎప్పుడు సమయం దొరికినా తండ్రి పక్కన వాలిపోతుంది. ఏ చిన్న అకేషన్ వచ్చినా మహేష్ గురించి చెప్పడానికి ముందు ఉంటుంది. నేడు ఫాదర్స్ డే సందర్భంగా.. సీతూ పాప ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేస్తూ తండ్రికి విషెస్ తెలిపింది.
మహేష్ చైర్ లో కూర్చొని ఉండగా.. అతడి గుండెలపై తలవాల్చి సితార నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఒక ఫొటోలో మహేష్.. నవ్వుతుండగా.. ఇంకొక ఫోటోలో అబ్బా.. సితార అల్లరి అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. ఇక ఈ ఫోటోకు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.. ఐ లవ్ యూ సో సో మచ్ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఇంకోపక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. తన ముద్దుల తనయ క్లింకారను ఎత్తుకున్న అద్భుతమైన ఫోటోను షేర్ చేశాడు. రామ్ చరణ్ - ఉపాసన లకు దాదాపు పదేళ్ల తరువాత క్లింకార పుట్టింది. మెగా ఫ్యామిలీలో ఈ అదృష్ట దేవత పుట్టిందో లేదో అన్ని మంచి శకునాలే జరిగాయి. ఇక ఈ చిన్నారి కూడా పుట్టడంతోనే చిన్నపాటి సెలబ్రిటీగా మారింది.
ఇక కూతరును చరణ్ నిమిషం కూడా వదలడం లేదు. ఇప్పటివరకు కూతురు ముఖాన్ని అభిమానులకి చూపించని చరణ్.. నేడు క్లింకారను గాల్లో ఎత్తుకొని కనిపించాడు. కూతురుతో గడపడం కోసం చరణ్ సినిమాలను కూడా పక్కన పెట్టాడు. ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాను. ఇప్పుడు నా కూతురితోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. ఆమె కోసం షూటింగ్ ను 6 గంటలోపు ముగించేస్తున్నాను. తను వచ్చాకా నా జీవితం పూర్తిగా మారిపోయింది అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











