కుమారి 21F, ఉప్పెన.. రెండు ఒక్కటే.. వర్జిన్, మగతనం విలువలు చెప్పిన గురు శిష్యులు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో దర్శకుల్లో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. వినూత్నంగా చెప్పిన కథలనే కాస్త బోల్డ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బోల్డ్ గా చెప్పే కథల్లో రొమాన్స్ డోస్ ఎక్కువైనా కొన్నిసార్లు ఆడియెన్స్ నుంచి పెద్దగా నెగిటివ్ కామెంట్స్ రావు. సుకుమార్ రైటింగ్స్ ఇప్పుడు అదే తరహాలో వెలుతోంది. ప్రేక్షకుల మనసులను తాకేలా చాలా చక్కగా ప్రజెంట్ చేస్తోంది సుకుమార్ రైటింగ్స్. దర్శకుడు సుకుమార్ తన శిష్యుల కోసమే సంస్థను స్థాపించినట్లు ఉంది. ఇక ఆ సంస్థ నుంచి వచ్చిన కుమారి 21F, ఉప్పెన సినిమాకున్న చిన్నా తేడా ఒకసారి గమనిస్తే..

 చిన్న బడ్జెట్ కథలు చాలానే ఉన్నాయట

చిన్న బడ్జెట్ కథలు చాలానే ఉన్నాయట

సుకుమార్ స్థాయి ఇప్పుడు మామూలుగా లేదు. ఆయన నుంచి ఆడియెన్స్ ఊహాలకందని రేంజ్ లో సినిమాలను కోరుకుంటున్నారు. ఇక అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న సుకుమార్ మేకింగ్ కు చాలా సమయం తీసుకుంటున్నాడు. అయితే చిన్న బడ్జెట్ కథలు చాలానే ఉన్నా తెరకెక్కించే సమయం దొరకడం లేదు. పైగా ఆ కథలు సుక్కు లెవెల్ కు సరిపోవు. అందుకే ఆయన శిష్యులకు అవకాశం ఇచ్చి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తున్నాడు.

కుమారి 21 వర్జిన్ కథ..

కుమారి 21 వర్జిన్ కథ..

సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన మొదటి సినిమా కుమారి 21F. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ అందరికి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. జీన్స్, స్కట్స్ వేసుకున్న ప్రతీ అమ్మాయి చెడిపోయిందని కాదు.. అనే పాయింట్ చుట్టూ అర్థమయ్యేలా స్టోరీ రాసారు సుకుమార్.

 శిష్యుడికి ఛాన్స్ ఇచ్చి

శిష్యుడికి ఛాన్స్ ఇచ్చి

కుమారి 21F కథను సుకుమార్ తన శిష్యుడు సూర్య ప్రతాప్ కు అందించాడు. ఆల్రెడీ అతను ఇదివరకే కరెంట్ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సుకుమార్ అతనిపై నమ్మకం ఉంచి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక కుమారి 21F పెట్టిన పెట్టుబడికి మూడింతల లాభాలను అందించింది.

ఉప్పెన కథను అలా అలోచించి..?

ఉప్పెన కథను అలా అలోచించి..?

ఇక ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కథను అనుకోకుండా రాసేడో లేక గురువు రాసిన కుమారి 21Fను నుంచి స్ఫూర్తి పొంది రివర్స్ లో ఆలోచించాడో తెలియదు గాని కథకు అపొజిట్ గా ఉప్పెనలో మగతనం విలువను చెప్పాడు. ఉప్పెన కథను అతనే సొంతంగా రాసుకున్నాడు. అందులో తన ఇన్వల్మెంట్ ఏమి కూడా లేదని సుకుమార్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు.

Recommended Video

Uppena Movie First Day Collections | Vaishnav Tej Record
 ఉప్పెన, కుమారి 21F.. సారాంశం ఒక్కటే

ఉప్పెన, కుమారి 21F.. సారాంశం ఒక్కటే

ఇక కుమారి 21కథలో చివరలో హీరోయిన్ వర్జీనిటీ కోల్పోతే.. ఉప్పెనలో హీరో పురుషాంగాన్ని కట్ చేయడం జరుగుతుంది. దాదాపు రెండు కథల సారాంశం ఒక్కటే. ప్రేమించే మనసు ముఖ్య కానీ సెక్స్ అనే అంశం ఏ మాత్రం అవసరం లేదని గురు శిష్యులు చాలా చక్కగా రాశారు. మరి భవిష్యత్తులో ఈ ఆర్య లవర్స్ ప్రేమలను ఇంకా ఎంత కొత్తగా వివరిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X