స్టార్ హీరో కుమారుడి పెళ్లి.. దేశంలోని అందరూ సీఎంలు అక్కడికే.. రాహుల్, చంద్రబాబు!
Recommended Video

బాలీవుడ్ స్టార్ స్టార్ దంపతులు రాజ్ బబ్బర్, స్వర్గీయ స్మితా పాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్ పెళ్లికొడుకయ్యాడు. ఆయన వివాహం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ నేత పవన్ సాగర్ కుమార్తె సన్యా సాగర్‌తో బుధవారం జరుగనున్నది. స్టార్ పొలిటిషియన్స్ హాజరయ్యే ఈ పెళ్లి జాతీయ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకొన్నది. నటుడు రాజ్ బబ్బర్ ప్రస్తుతం యూపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రతీక్ ఇటీవల బసంత్ పంచమి చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. వివరాల్లోకి వెళితే..

పదేళ్లుగా పీకల్లోతు ప్రేమలో
ప్రతీక్ బబ్బర్, సన్యా గత పదేళ్లుగా ప్రేమించుకొంటున్నారు. తమ ప్రేమను పెద్దల దృష్టికి వెళ్లి ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. సన్యా నిఫ్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. లండన్ ఫిల్మ్ అకాడమీ నుంచి డిప్లోమా కూడా పొందారు. రాజ్ బబ్బర్ రెండో భార్య, విలక్షణ నటి స్మితా పాటిల్ కుమారుడు ప్రతీక్. స్మితా పాటిల్ క్యాన్సర్ వ్యాధిలో మరణించిన సంగతి తెలిసిందే.

లక్నోలో అంగరంగ వైభవంగా
ప్రతీక్ బబ్బర్, సన్యా వివాహం లక్నో పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఇప్పటికే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లను అట్టహాసంగా నిర్వహించారు. ప్రతీక్ పెళ్లికి రాజకీయ ప్రాధాన్యం ఉండటంతో భారీగా పోలీసు బలగాలను లక్నోలో మోహరించారు. రాజకీయ, సినీ ప్రముఖులు రాకతో లక్నోకు కొంత సంతరించుకొన్నది.

పెళ్లికి రాహుల్ గాంధీ
ప్రస్తుతం అమేథి పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రతీక్ వివాహానికి హాజరవుతున్నారు. బుధవారం లక్నోలో పర్యటించిన ప్రతీక్, సన్యాకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

పోటెత్తనున్న రాజకీయ ప్రముఖులు
ప్రతీక్, సన్య వివాహానికి భారీగా యూపీ పొలిటిషియన్స్ పోటెత్తనున్నారు. బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ముంబైలో భారీగా విందు ఏర్పాటు
ప్రతీక్, సన్యా పెళ్లి తర్వాత ముంబైలో భారీ విందును రాజ్ బబ్బర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











