దీపిక-రణవీర్ వివాహం... అస్తిపంజరం ఫోటోతో కేంద్ర మంత్రి షాకింగ్ ట్వీట్!
Recommended Video

బాలీవుడ్ నటి దీపిక పదుకోన్, రణవీర్ కపూర్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో బుధవారం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. నిన్న కొంకణి స్టైల్‌లో వివాహ వేడుక నిర్వహించారు. నేడు సింధి స్టైల్‌లో మరోసారి పెళ్లి జరిగింది. ఈ నెల 21న బెంగళూరులో, 28న ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేయనున్నారు.
కాగా... దీపిక- రణవీర్ పెళ్లి ఫోటోల కోసం దేశాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వారు ఫోటోలను విడుదల చేయకపోవడం అసంతృప్తి వ్యక్తం చేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టారు.

వారి ఫోటోల కోసం ఎదురు చూస్తే అస్తిపంజరాలవుతారు
ఎక్కువ సమయం దీపిక-రణవీర్ పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తే ఇలాంటి గతి పడుతుంది అని అర్థం వచ్చేలా ... ఒక బల్లపై కూర్చున్నట్లు ఉన్న అస్తిపంజరం ఫోటోను ఆమె షేర్ చేశారు.

స్మృతి ఇరానీ తీరుపై భిన్నాభిప్రాయాలు
అయితే స్మృతి ఇరానీ ఇలా అస్తిపంజరం ఫోటో పోస్టు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె పోస్ట్ ఫన్నీగా ఉందని కొందరు అంటుంటే... శుభమా! అని పెళ్లి జరుగుతుంటే ఇలాంటి చెత్త పోస్టులు ఏమిటి? అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్
దీపిక-రణవీర్ పెళ్లి ఫోటోలు ఇంకా విడుదల చేయక పోవడంపై... అభిమానులు ఎదురు చూస్తున్న తీరుపై ఇంటర్నెట్లో ఫన్నీ మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ముఖ్యంగా అనుష్క శర్మ ఫోటో ఉన్న ఓ మీమ్ అందరినీ తెగ నవ్విస్తోంది.
ఇంటర్నెట్ వెయింటింగ్
ఇండియాలో ప్రతి ఒక్క సినీ అభిమాని ఇంటర్నెట్లో దీపిక రణవీర్ పెళ్లి ఫోటోలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు.
వాటి గురించే సెర్చ్ చేస్తున్నారు
గూగుల్‌లో కూడా చాలా మంది దీప్‌వీర్ పెళ్లి ఫోటోస్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు కానీ దొరకడం లేదు. గురువారం సాయంత్రం వరకు ఈ ఫోటోలు విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











