twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆచార్య సెట్లో సోనుసూద్ సర్‌ఫ్రైజ్ గిప్లులు.. 100 మందిపై ప్రేమను కురిపించిన రియల్ హీరో

    |

    కరోనావైరస్ కాలంలో దేశవ్యాప్తంగా ఎంతో మంది వలస కార్మికులను ఆదుకొన్న నటుడు సోను సూద్ వార్తల్లో వ్యక్తిగా మారారు. లాక్‌డౌన్ ఉన్నా లేకపోయినా ఆపదలో ఉన్నామంటూ సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న పోస్టు పెట్టినా స్పందిస్తూ తనలోని గొప్ప గుణాన్ని బయటపెట్టుకొన్నారు. తాజాగా ఆచార్య షూటింగులో యూనిట్ సిబ్బందికి సర్‌ప్రైజ్ గిఫ్టులు అందించిన సోనుసూద్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ వివారాల్లోకి వెళితే..

    లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో బిజీగా

    లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో బిజీగా

    లాక్‌డౌన్ తర్వాత షూటింగులు ప్రారంభం కావడంతో టాలీవుడ్‌ చిత్రాలతో సోనుసూద్ బిజీగా మారిపోయారు. పలు షూటింగుల్లో పాల్గొంటూ సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్ర షూటింగులో మెగాస్టార్‌తో జత కలిశారు. తనపై రచించిన అయామ్ నో మెస్సయ్యా అనే పుస్తకాన్ని చిరంజీవికి అందజేశారు.

    ఆచార్య షూటింగులో చిరంజీవితో

    ఆచార్య షూటింగులో చిరంజీవితో

    ఇక ఆచార్య షూటింగ్ హైదరాబాద్ శివారులో దాదాపు 20 ఎకరాల్లో 20 కోట్లతో వేసిన భారీ సెట్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతున్నది. సోనుసూద్, చిరంజీవిపై కీలక సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా వంద మంది చిత్ర యూనిట్ సభ్యులకు సోనుసూద్ బహుమతిని అందించారు.

    100 మంది కార్మికులకు మొబైల్ ఫోన్లు

    100 మంది కార్మికులకు మొబైల్ ఫోన్లు

    ఆచార్య షూటింగులోని 100 మంది యూనిట్ సభ్యులకు ఒక్కో మొబైల్ ఫోన్‌ను సోనూసూద్ బహుకరించారు. సోనుసూద్ బహుకరించిన మొబైల్ ఫోన్లను అందుకొన్న యూనిట్ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. తమపై ప్రేమను కురిపించిన సోనుసూద్‌పై పొగడ్తల వర్షం కురిపించడం గమనార్హం.

    అల్లుడు అదుర్స్ చిత్రంతో సంక్రాంతికి

    అల్లుడు అదుర్స్ చిత్రంతో సంక్రాంతికి

    లాక్‌డౌన్ తర్వాత సోనుసూద్ నటించిన తొలి తెలుగు చిత్రం అల్లు అదుర్స్ చిత్రం సంక్రాంతి కానుకుగా రిలీజ్ కానున్నది. జనవరి 15వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రంలో కామెడీ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల రిలీజైన సినిమా ట్రైలర్‌లో సోనుసూద్ ఆకట్టుకొన్నారు.

    English summary
    Actor and philanthropist Sonu Sood gifts 100 mobile phones to Chiranjeevi's Acharya Unit members. He gifted each and every worker of the Acharya which is shooting in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X