50th Movie: 50వ సినిమాతో హిట్టు కొట్టిన ముగ్గురు హీరోలు.. ఆ టాప్ స్టార్స్ ఎవరో తెలుసా?
ఈ ఏడాదిలో మన సౌత్ ఇండియా సినిమా నుంచి చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఈ చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లతో కూడిన సినిమాలు మాత్రమే పెద్ద విజయాలు సాధించాయి. అయితే ప్రతీ నటీనటుడికి కూడా తమ కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమాలు అంటూ కొన్ని ఉంటాయి. ఒక 25వ సినిమా అని 50వ సినిమా అని 100, 150, 175 ఇలా చాలా క్యాలుక్యులేషన్స్ హీరో లేదా హీరోయిన్స్ విషయంలో ఆసక్తిగా మారుతాయి.
అయితే ఇలా స్పెషల్ నెంబర్ తో వచ్చే సినిమాలపై మాత్రం కొంచెం ప్రత్యేక అంచనాలు ఉంటాయని చెప్పాలి. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ ఒక్క ఏడాదిలోనే అది కూడా మన సౌత్ కి చెందిన టాలెంటెడ్ హీరోస్ నుంచి తమ కెరీర్ లో మైలురాయి చిత్రాలుగా తమ 50వ ప్రాజెక్ట్ లు రిలీజ్ అయ్యి ఇంట్రెస్టింగ్ గా మూడూ కూడా సాలిడ్ హిట్ అయ్యాయి.

కాగా ఆ హీరోలు తమిళ్ నుంచి ఇద్దరు, మళయాళళం నుంచి ఒకరు ఉన్నారని చెప్పాలి. మరి తమిళ్ నుంచి అయితే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక సేవియర్ గా తన 50వ సినిమా "మహారాజ" తో వచ్చాడు. దర్శకుడు నితిలన్ తో ఒక హీరోకి 50వ సినిమా ఎలాంటిది కావాలో అలాంటి సినిమాని తాను అందించి డ్రై గా ఉన్న థియేటర్స్, బాక్సాఫీస్ ల వద్ద సాలిడ్ నంబర్స్ తో 100 కోట్ల వసూళ్లు అందుకున్నాడు.
ఇలా తాను మంచి హిట్ గా తన 50వ సినిమాని మలచుకున్నాడు. ఇక తన తర్వాత తన కెరీర్ లో 50వ సినిమాతో ధనుష్ తన రాయన్ తో వచ్చాడు. ఇది తన 50వ సినిమాతో పాటుగా తన దర్శకత్వంలోనే రావడం విశేషం. దీనితో ఈ సినిమా కూడా 100 కోట్లకి పైగానే వసూలు చేయగా ఇది కూడా ఓ హీరోకి 50వ సినిమాగా మంచి హిట్ అయ్యింది. అయితే వీరితో పాటుగా మరో హీరో తన 50వ సినిమాతో వచ్చి సాలిడ్ హిట్ కొట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అతడే మలయాళ స్టార్ హీరో టోవినో థామస్. తెలుగు ఆడియెన్స్ కి అయితే "మిన్నల్ మురళీ" గా బాగా పరిచయం. మరి ఈ హీరో తన కెరీర్ లో నటించిన 50వ సినిమానే "ARM". దర్శకుడు జితిన్ లాల్ తెరకెక్కించిన ఈ చిత్రం మలయాలలో హిట్ టాక్ తెచ్చుకొని భారీ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. ఆల్రెడీ 3 రోజుల్లో 25 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని కాన్స్టాంట్ గా పెర్ఫామ్ చేస్తూ దూసుకెళ్తుంది.
దీనితో ఇలా థామస్ కూడా తన 50వ సినిమాతో హిట్ కొట్టేసినట్టే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఈ 2024 సంవత్సరం మాత్రం తమ 50వ సినిమాలతో వచ్చిన హీరోలకి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. కాగా టోవినో థామస్ నటించిన లాస్ట్ చిత్రం "కేరళ 2018" 200 కోట్లకి పైగా రికార్డు వసూళ్లు కొల్లగొట్టి మోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఇపుడు ఈ ARM ఎక్కడ ఆగుతుందో అని ట్రేడ్ పండితులు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











