పల్లకి మోసే వ్యక్తుల పాదాలను మొక్కిన బాలసుబ్రహ్మణ్యం.. వీడియో వైరల్

లెజండరీ సింగర్ SP. బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా నిన్నటితో పూర్తిగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ విషాద ఘటనను ఇంకా ఎవరు మర్చిపోలేపోతున్నారు. ఏఆర్.రెహమాన్, దేవి శ్రీ ప్రసాద్, ఇళయరాజా వంటి అగ్ర సంగీత దర్శకులు ఆయనతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలుకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక లేటెస్ట్ గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శబరిమల ఆలయం యొక్క పాత వీడియో వైరల్ అవుతోంది. వృద్ధాప్యం మరియు శారీరకంగా వికలాంగులను పర్వత ప్రాంతాల నుండి ఆలయానికి తీసుకెళ్లడానికి వారిని ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం కూడా అలానే వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఆయన శబరిమల ఆలయంలోని పల్లకీ బేరర్ల (డాలీ మెన్) పాదాలను మొక్కిన విధానం భావోద్వేగానికి గురి చేస్తోంది.

SP Balasubrahmanyam touches feet of palanquin bearers

వీడియోలో వారు మోయడానికి సిద్ధమవ్వగా గౌరవ చిహ్నంగా వారి పాదాల వద్ద పడటం చూడవచ్చు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలతోనే కాకుండా ప్రజలపై ఆయనకున్న వినయం, ఆప్యాయత కూడా చాలా అమితమైనది. అభిమానులు అనేక రియాలిటీ షోలలో స్టేజ్ షోలలో వ్యక్తిగతంగా బాలు గారి వినయపూర్వకమైన స్వభావాన్ని చూశారు.

నటి కార్తికా నాయర్ ఈ వైరల్ వీడియోను షేర్ చేసి ఎస్.పి.బి యొక్క వినయం గురించి మాట్లాడారు. ఆయన మనస్సు ఎంత స్వఛ్చమైనదో ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం సర్ పల్లకి మోసేవారి పాదాలను తాకడంతోనే ఆయన గొప్పతనం ఏమిటో అర్ధమవుతోందని ఆమె వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X