RRR షూటింగ్ స్పాట్‌ నుంచి స్పెషల్ పిక్ లీక్: అందులో ఉన్నది ఆ హీరోనే.. పోస్ట్ చేసి షాకిచ్చిన నటుడు

'బాహుబలి'తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఒకవైపు.. తమ నటనతో కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న హీరోలు మరోవైపు.. సినిమాపై నమ్మకంతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోన్న నిర్మాత ఇంకోవైపు.. వీళ్లంతా కలిసి ఒకే ఒక్క సినిమా కోసం. అదే RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్‌లోనే కాదు.. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో RRR షూటింగ్ స్పాంట్ నుంచి ఓ స్పెషల్ పిక్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

విప్లవ వీరులుగా టాలీవుడ్ స్టార్ హీరోలు

విప్లవ వీరులుగా టాలీవుడ్ స్టార్ హీరోలు

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. ఐదు భాషల్లో రాబోతున్న ఈ భారీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం ఇస్తున్నారు.

భారీ సీన్స్ బ్యాలెన్స్.. అసలైంది మొదలు

భారీ సీన్స్ బ్యాలెన్స్.. అసలైంది మొదలు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవలేదు. అంతేందుకు ఎంతో ముఖ్యమైన కాంబినేషన్ సీన్స్‌తో పాటు ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చిత్రీకరించలేదు. వీటిలో ఇటీవలే క్లైమాక్స్ సీన్ షూటింగ్ మొదలైంది.

రెండింటికీ సూపర్ రెస్పాన్స్.... రికార్డులు

రెండింటికీ సూపర్ రెస్పాన్స్.... రికార్డులు

భారీ చిత్రం కావడంతో RRR (రౌద్రం రణం రుధిరం)పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే చిత్ర యూనిట్ సస్పెన్స్ కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ రికార్డులు క్రియేట్ చేశాయి.

రెండు మారాయి.. ఇదైనా నిజమౌతుందా?

రెండు మారాయి.. ఇదైనా నిజమౌతుందా?

వాస్తవానికి RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించే సమయంలోనే ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ మూవీని అక్టోబర్ 13, 2021న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

RRR షూటింగ్ స్పాట్‌ నుంచి స్పెషల్ పిక్ లీక్

RRR షూటింగ్ స్పాట్‌ నుంచి స్పెషల్ పిక్ లీక్

మిగిలిన సినిమాలతో పోలిస్తే RRR కొంత ప్రత్యేకమనే చెప్పాలి. అందుకే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇక, లీకైనవి బయటకు వస్తే మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి కొన్ని ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా షూటింగ్ స్పాట్ నుంచి ఓ స్పెషల్ పిక్ బయటకు వచ్చింది.

Recommended Video

Acharya Movie : Chiranjeevi నటన పై Sri Reddy ఘాటు విమర్శలు..!!
అందులో ఉన్నది ఆ హీరోనే అంటున్నారు

అందులో ఉన్నది ఆ హీరోనే అంటున్నారు

ధృవన్ అనే చైల్డ్ ఆర్టిస్టు తన సోషల్ మీడియా ఖాతాలో అడవిలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. RRR షూటింగ్ టైమ్‌లోది అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఇది అల్లూరిగా చేస్తున్న రామ్ చరణ్ చిన్నప్పటి గెటప్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో కొమరం భీంది కూడా అయి ఉండే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. మొత్తానికి ఈ పిక్ సెన్సేషన్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X