మమ్ముట్టి బర్త్ డే.. వైఎస్ఆర్‌ని దింపేశాడుగా!
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి 67 వ జన్మదినం జరుపుకుంటున్నారు. విలక్షణ నటుడిగా ఇన్నేళ్లు ఆయన నటన జీవితంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం మమ్ముట్టి వైఎస్ఆర్ బయోపిక్ చిత్రం యాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మమ్ముట్టి బర్త్ డే సందర్భంగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఒకటి వైరల్ గా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ట్రేడ్ మార్క్ స్టయిల్ లో చేయి ఊపుతూ మమ్ముట్టి కనిపిస్తున్నాడు. మమ్ముట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోస్టర్ విడుదల చేశారు.

వైఎస్ సీఎం కాకముందు చేసిన పాదయత్రని ఈ చిత్రంలో హైలైట్ చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











