Women's Day 2025: 40 ప్లస్‌లోనూ ముదురు భామల జోరు.. హీరోలను మించిన సక్సెస్, ఎవరెవరంటే?

రంగుల రాట్నం లాంటి చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. కొందరు కథానాయికలు వెండితెరపై అలా వచ్చి ఇలా మాయమవుతారు. కానీ కొందరు మాత్రమే దశాబ్ధాల పాటు వెండితెరపై కొనసాగుతారు. అంతేకాదు.. స్టార్స్‌ను మించి క్రేజ్, రెమ్యునరేషన్‌ను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలాంటి కొందరు హీరోయిన్లను ఒకసారి పరిశీలిస్తే:

నయనతార :

2003లో మానస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేసిన నయనతార 20 దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో ఎన్నో క్లాసిక్స్‌లో నటించారు. కెరీర్, పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఒడిదొడుకులను, వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్నారు. చంద్రముఖి, లక్ష్మీ, శ్రీరామరాజ్యం, రాజారాణి, సైరా నర్సింహారెడ్డి, జవాన్ తదితర సినిమాల్లో నటించారు. సౌత్‌లోని అందరూ అగ్రహీరోల సరసన నటించిన నయనతార .. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో జవాన్‌లో నటించి హిట్ అందుకున్నారు. ఈ తరంలో 75కు పైగా సినిమాలు కంప్లీట్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్‌గా నయనతార నిలిచారు. దూకుడు స్వభావం, తెగువతో స్టార్స్‌నే ఢీకొట్టి నిలిచారు నయన్.

special story on nayanthara trisha and Anushka sheety on the occasion of Women s Day 2025

త్రిష కృష్ణన్ :

ప్రశాంత్ , సిమ్రన్ నటించిన జోడి అనే సినిమా ద్వారా 1999లో వెండితెరపై అడుగుపెట్టిన చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ దాదాపు పాతికేళ్లుగా టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. వర్షం, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, దమ్ము, పొన్నియన్ సెల్వన్ తదితర చిత్రాలతో అగ్రనటిగా నిలిచారు. ఒకదశలో త్రిషను వరుసగా ప్లాప్స్ పలకరించగా ఆమె కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు.

ఇక పెళ్లి చేసుకుని లైఫ్‌లో స్థిరపడిపోవాలని అనుకుని నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస విజయాలతో మరి కొన్నేళ్ల వరకు తనకు ఢోకా లేదని నిరూపించింది. పాతికేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించారు త్రిష. ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతోన్న విశ్వంభరలో నటిస్తున్నారు.

అనుష్క శెట్టి :

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన అతికొద్దిమంది హీరోయిన్‌లలో అనుష్క ఒకరు. యోగా టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన అనుష్క దక్షిణ భారతదేశంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. 2005లో సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క .. విక్రమార్కుడు, లక్ష్యం, డాన్, బిల్లా, వేదం, ఖలేజా, అరుంధతి, భాగమతి, నాగవల్లి, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాలతో తిరుగులేని నటిగా వెలుగొందుతున్నారు. ఈ ఏడాదితో హీరోయిన్‌గా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోనున్నారు అనుష్క. మధ్యలో గ్యాప్ వచ్చినా అనుష్క స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటి, మలయాళంలో మరో సినిమాలో నటిస్తున్నారు జేజమ్మ.

ప్రియాంక చోప్రా :

గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్నారు ప్రియాంక చోప్రా. మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించి భారతదేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సాధించిన పెట్టి 2002లో ఓ తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ డస్కీ బ్యూటీ దాదాపు 23 ఏళ్లుగా వెండితెరను ఏలుతున్నారు. అందాజ్, క్రిష్, డాన్, ఫ్యాషన్, కమినే, బర్ఫీ, మేరీకోమ్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలతో బాలీవుడ్ టాప్ స్టార్‌గా నిలిచారు. అనంతరం హాలీవుడ్‌కు షిప్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ అక్కడి సూపర్‌స్టార్స్‌తో నటించారు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను 2018లో ప్రేమించి పెళ్లాడిన ప్రియాంక అమెరికాలో స్థిరపడ్డారు. జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు భారత ప్రభుత్వం చేతుల మీదుగా పద్మశ్రీ, ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఒకరిగా నిలిచారు.

special story on nayanthara trisha and Anushka sheety on the occasion of Women s Day 2025

కాజల్ అగర్వాల్ :

పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ 2004లో అమితాబ్ బచ్చన్ నటించిన క్యూ హో గయానా అనే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ - తేజ కాంబోలో వచ్చిన లక్ష్మీ కళ్యాణంతో కాజల్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్ హీరోగా వచ్చిన మగధీర చిత్రం కాజల్ కెరీర్‌ను మలుపు తిప్పింది. రెండు దశాబ్థాల కెరీర్‌లో తెలుగుతో పాటు తమిళ్‌, హిందీలలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు కాజల్. 2020 కరోనా సమయంలో తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడగా.. ఈ దంపతులకు ఓ బాబు సంతానం. పెళ్లయి, పిల్లలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు ఈ చందమామ. రస్తుతం ఇండియన్ 3, కన్నప్ప, సికిందర్, ది ఇండియా లవ్ స్టోరీ సినిమాల్లో నటిస్తున్నారు కాజల్.

More from Filmibeat

Read more about: movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X