For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐదేళ్ల వివాహా బంధం.. భర్త కౌగిలిలో బంధీ.. కళ్యాణ్ దేవ్ శ్రీజ పిక్ వైరల్

    |

    మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహా బంధం గురించి అందరికీ తెలిసిందే. మొదటి పెళ్లి అంతగా కలిసి రాకపోయినా రెండో పెళ్లితో జీవితం సంతోషమయంగా మారింది. కళ్యాణ్ దేవ్‌ను రెండో వివాహాం చేసుకున్న శ్రీజ ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉంటోంది. వీరి అన్యోన్య దాంపత్యానికి ఐదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా భర్తను తలుచుకుంటూ శ్రీజ ఎమోషనల్ అయింది.

    క్లీవేజ్ షోతో హల్చల్.. నిక్కీ తంబోలి రచ్చ

    వివాహాబంధంతో..

    వివాహాబంధంతో..

    శ్రీజ మొదటి వివాహాబంధం ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. అయితే అది కొన్నాళ్లకే విడాకుల వరకు వెళ్లింది. అలా శ్రీజ కళ్యాణ్ దేవ్‌ను 2016లో వివాహాం చేసుకుంది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఎంతో సఖ్యతగా ఉంటున్నారు. ఈ ఇద్దరికి నవిష్క జన్మించిన సంగతి తెలిసిందే.

    నవిష్క హల్చల్..

    నవిష్క హల్చల్..

    సోషల్ మీడియాలతో నవిష్క ఫోటోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. నవిష్క బారసాల ఫోటోలు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా హాజరవ్వడంతో అందరి దృష్టి పడింది. లాక్డౌన్ సమయంలో నవిష్కతో చిరు ఆడుకున్న ఆటలు కూడా వైరల్ అయ్యాయి.

    స్పెషల్ వెకేషన్..

    స్పెషల్ వెకేషన్..

    శ్రీజ, కళ్యాణ్ ఆ మధ్య స్పెషల్ వెకేషన్‌కు వెళ్లారు. కళ్యాణ్ దేవ్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకునేందుకు ఈ జంట మాల్దీవుల్లో హల్చల్ చేసింది. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక మాల్దీవుల్లో ఈ జంట్ తెగ సందడి చేసింది. ఇప్పుడు శ్రీజ తమ ఐదేళ్ల వివాహా బంధం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.

    భర్త కౌగిలిలో బంధీ..

    భర్త కౌగిలిలో బంధీ..

    ఒక్కోసారి నా కోసం మీరు చేసే పనులు చూసి ఆశ్చర్యపోతుంటాను, నా బలహీనతలను మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారో, భరిస్తారో గ్రహించాను. మన ఐదేళ్ల అసంపూర్ణమైన పరిపూర్ణమైన ఐదేళ్ల వివాహాబంధానికి చీర్స్ అంటూ భర్త కౌగిలిలో బంధీ అయిన ఫోటోను శ్రీజ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.

    60 నెలలు, 260 వారాలు..

    60 నెలలు, 260 వారాలు..

    60 నెలలు, 260 వారాలు.. 1825 రోజులు.. లేదా.. మొత్తంగా ఐదేళ్లు.. ఎలా లెక్కపెట్టినా సరే.. ఇదంతా ప్రేమకు ప్రతిరూపమే.. ఈ ఐదేళ్లు అద్భుతంగా గడిచాయ్.. వివాహా దినోత్సవ శుభాకాంక్షలు అని కళ్యాణ్ దేవ్ స్పెషల్ పోస్ట్ వేశాడు. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

    English summary
    Sreeja and kalyaan dhev 5th wedding anniversary..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X