నీతో ఉంటే ఎప్పుడూ అలా ఉంటుంది.. మంచు లక్ష్మీపై శ్రీజ కామెంట్స్
మంచు, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. గొడవలు ఎలా ఉన్నాయని బయటకు ప్రచారం జరుగుతుంతో.. లోపల మాత్రం అంతకు మించి అనేలా ప్రేమలు కారిపోతుంటాయి. ఈ మధ్య అయితే అది ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఒకరింటికి మరొకరు వెళ్తున్నారు. సినిమా ఒపెనింగ్‌లకు వస్తున్నారు. పైగా పండుగల వేళ అందరూ కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
మోహన్ బాబు, చిరంజీవి మధ్య కొన్ని గొడవలు ఆ మధ్య జరిగాయి. ఆ విషయాలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే వారిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది. ఈ ఇద్దరి కంటే కూడా మంచు, మెగా వారసుల మధ్య మంచి బంధాలున్నాయి. మంచు మనోజ్ రామ్ చరణ్ మంచు లక్ష్మీ ఎక్కువగా క్లోజ్. అయితే మంచు లక్ష్మీ సాధారణంగా సెలెబ్రిటీలందరితోనూ ఎక్కువ చనువుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో ఎంతో కలిసిపోతుంది.

తాజాగా మంచు లక్ష్మీ, శ్రీజ కలిసి పార్టీలో ఎంజాయ్ చేసినట్టున్నారు. మామూలుగా మంచు లక్ష్మీ ఎక్కడుంటే అక్కడంతా సందడి వాతావరణం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని శ్రీజ చెప్పుకొచ్చింది. అక్క నువ్ ఉంటే అసలు డల్ మూమెంట్ అనేదే ఉండదని పొగిడేసింది. గత వారమే మంచు లక్ష్మీ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ఎంత సందడి చేసిందో అందరూ చూశాం. ఆ ఫోటోలన్నీ కూడా తెగ వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











